AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Onions: శీతాకాలంలో కీళ్ళ వాపు, నొప్పులతో బాధపడుతున్నారా? వీటిని తిన్నారంటే

చలికాలంలో పచ్చి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తాయి. అలాగే పచ్చి ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చి ఉల్లిపాయలు తినడం..

Green Onions: శీతాకాలంలో కీళ్ళ వాపు, నొప్పులతో బాధపడుతున్నారా? వీటిని తిన్నారంటే
Green Onions
Srilakshmi C
|

Updated on: Dec 08, 2023 | 8:43 PM

Share

చలికాలంలో పచ్చి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తాయి. అలాగే పచ్చి ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం..

ఎముకలకు పుష్టి

చలికాలంలో చాలా మందికి ఎముకలు, కీళ్ల నొప్పులు మొదలవుతాయి. కీళ్ళ వాపు, నొప్పులతో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎముకలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడే అనేక పోషకాలు పచ్చి ఉల్లిపాయలో ఉన్నాయి. విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మొదలైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పి నివారిణిగా పనిచేస్తాయి.

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది

పచ్చి ఉల్లిపాయలో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉల్లిపాయ జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఉల్లి రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గుండెకు మేలు

ఉల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం

విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పచ్చి ఉల్లిపాయల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గుతో పోరాడడంలో సహాయపడతాయి. విటమిన్ సి శరీర ఇన్ఫెక్షన్లు, వైరస్లతో పోరాడటానికి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నివారించి, ఫైటోకెమికల్స్ వైరస్‌, బ్యాక్టీరియాలను చంపుతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!