Bread Puri: బ్రెడ్ తో పూరీలను ఇలా చేయండి.. మసాలా కూరతో తింటే అదిరిపోతాయి!

బ్రెడ్ పూరీ వినడానికే చాలా డిఫరెంట్ గా ఉంది కదా. సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ అయినా.. పూరీ అయినా విడిగా తింటారు. బ్రెడ్ తో రకరకాల తీపి వంటకాలు, స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారు. బ్రెడ్ తో ఏ వంటకం చేసినా టేస్టీగా ఉంటాయి. బ్రెడ్ తో అవే కాకుండా పూరీలు కూడా తయారు చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. ఇవి ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం చాలా సింపుల్. అలాగే చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. మరి బ్రెడ్ తో..

Bread Puri: బ్రెడ్ తో పూరీలను ఇలా చేయండి.. మసాలా కూరతో తింటే అదిరిపోతాయి!
Bread Puri
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Dec 07, 2023 | 11:20 PM

బ్రెడ్ పూరీ వినడానికే చాలా డిఫరెంట్ గా ఉంది కదా. సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ అయినా.. పూరీ అయినా విడిగా తింటారు. బ్రెడ్ తో రకరకాల తీపి వంటకాలు, స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారు. బ్రెడ్ తో ఏ వంటకం చేసినా టేస్టీగా ఉంటాయి. బ్రెడ్ తో అవే కాకుండా పూరీలు కూడా తయారు చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. ఇవి ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం చాలా సింపుల్. అలాగే చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. మరి బ్రెడ్ తో రుచిగా ఉండే పూరీలను ఎలా తయారు చేసుకుంటారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ తో పూరీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

బ్రెడ్, గోధుమ పిండి లేదా మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, పెరుగు, నూనె.

బ్రెడ్ పూరీ తయారీ విధానం:

బ్రెడ్ స్లైసెస్ ను జార్ లో వేసి మెత్తగా పొడిలా తయారు చేసుకోవాలి. ఈ బ్రెడ్ పొడిన ఒక లోతైన గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే గోధుమ పిండి లేదా మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, కొద్దిగా గోరు వెచ్చటి ఆయిల్, పెరుగు వేసి పిండిని ముందు కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడినంత నీళ్లు పోస్తూ పిండిని కలపాలి. పిండిని మరీ మెత్తగా కాకుండా.. కొద్దిగా గట్టిగా ఉండేలా కలపండి. దీన్ని ఓ 20 నిమిషాల పాటు పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఈ లోపు పిండిని తీసుకుని మరోసారి కలిపి.. ఉండలుగా చేసుకుని.. పూరీల్లా వత్తు కోవాలి. ఆయిల్ వేడెక్కాక వీటిని ఒక్కొక్కటి వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చు కోవాలి. ఇలా రెడీ అయిన పూరీలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పూరీలు రెడీ అవుతాయి. వీటిని మసాలా కూరతో తింటే.. చాలా బావుంటాయి. ఒకదాని తర్వాత మరొకటి తింటూ ఉంటారు. వీకెండ్స్ లో లేదా ఏదైనా స్పెషల్ డేస్ లో వీటిని చేసుకుని తినవచ్చు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒక సారి ట్రై చేయండి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!