Coconut Water: వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలకు విరుగుడు కూడా!
ఎండాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పానియాల్లో కొబ్బరి నీళ్లు ముఖ్యమైనవి. వీటిని తీసుకోవడం వల్ల ఫ్రెష్‌గా ఉన్న అనుభూతి కలుగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లలో సహజ ఎలక్ట్రోలైట్ ఉండటం వల్ల తక్షణ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అమినో యాసిడ్స్, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, సైటోకినిన్, ఫాస్పరస్, విటమిన్ సి, బి-1, బి-2, బి-3 వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు, ఎంజైములు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, సోడియం, చక్కెర పరిమాణం కూడా..
ఎండాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పానియాల్లో కొబ్బరి నీళ్లు ముఖ్యమైనవి. వీటిని తీసుకోవడం వల్ల ఫ్రెష్‌గా ఉన్న అనుభూతి కలుగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లలో సహజ ఎలక్ట్రోలైట్ ఉండటం వల్ల తక్షణ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అమినో యాసిడ్స్, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, సైటోకినిన్, ఫాస్పరస్, విటమిన్ సి, బి-1, బి-2, బి-3 వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు, ఎంజైములు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, సోడియం, చక్కెర పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. వీటిని డైలీ తాగడం వల్ల శరీరంపై మాత్రమే కాకుండా జుట్టు, చర్మంపై కూడా ఎన్నో సానుకూల ప్రభావాలను చూపుతుంది.
వేసవిలో ఎండ వేడిని అధిగమించడానికి అనేక రకాల పానీయాలు తాగుతారు. కానీ మార్కెట్‌లో ప్యాక్ చేసిన పానీయాలు తాగితే, అవి ఆరోగ్యానికి మేలుకు బదులు కీడు తలపెడతాయి. అయితే కొబ్బరి నీళ్లు మాత్రం సహజ పానీయం. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, ఎటువంటి దుష్ప్రభావాలు కలుగజేయదు. కాబట్టి కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
హీట్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది
ఎండాకాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇది హీట్ స్ట్రోక్‌ను నివారిస్తుంది. నిజానికి శరీరంలోని డీహైడ్రేషన్ వల్ల హీట్‌స్ట్రోక్ సమస్య వస్తుంది. రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అలసట, బద్ధకం, బలహీనత వంటి సమస్యలు దరిచేరవు. ఇది ఎముకలు, కండరాలను కూడా బలపరుస్తుంది.
చర్మానికి మేలు
కొబ్బరి నీళ్లను రోజూ తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటంతోపాటు మీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. రోజూ కొబ్బరినీళ్లు తాగితే చర్మం మెరిసిపోవడంతో పాటు అకాల ముడతలు వంటి సమస్యలు దరిచేరవు. చర్మం ఆకృతి మెరుగుపడటంతో పాటు, మొటిమల సమస్య కూడా తగ్గుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు
కొబ్బరి నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండదు. అలాగే ఇన్సులిన్ నిర్వహణలోనూ సహాయపడుతుంది. కాబట్టి కొబ్బరి నీల్లు సేవించడం డయాబెటిక్ వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. తద్వారా మధుమేహంతో సహా అనేక ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. కొబ్బరి నీరు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. హైబీపీ సమస్య ఉన్నవారికి కూడా మేలు చేస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబందిత కథనాల కోసం క్లిక్ చేయండి.