Onion Benefits: వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం లభించేందుకు రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. అయితే వేసవిలో ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా.? ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఇలాగే వచ్చింది. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండాకాలంలో సాధారణంగా చాలామంది వడదెబ్బకు గురవుతుంటారు. ఈ సమయంలో పచ్చి ఉల్లిపాయకు మించిన వైద్యం లేదంటున్నారు నిపుణులు. వడదెబ్బకు పచ్చి ఉల్లిపాయ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. అధిక ఉష్ణోగ్రత నుంచి రక్షించడంలో ఉల్లిపాయలు ఎంతో కీలకంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఇందులోని సెలీనియం అనే మూలకం రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో సమ్మర్‌లో తరచూ వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇక పచ్చి ఉల్లిపాయ, నిమ్మరసం కలిపిన సలాడ్ తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి, పొట్ట సమస్యలు దరిచేరవు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు పచ్చి ఉల్లిపాయ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. సల్ఫర్, క్వెర్సెటిన్ వంటి యాంటీ-డయాబెటిక్ సమ్మేళనాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!