ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే చాలా మంచిదట.. మీ ఆరోగ్యం సూపర్ గా ఉంటుంది..!
తమలపాకులు, మెంతులు ఈ రెండూ ఆయుర్వేదంలో శక్తివంతమైన ఔషధ మొక్కలుగా పరిగణించబడుతాయి. వీటిని కలిపి తినడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మెంతి గింజల్లో ఉండే గ్లూకోమన్నాన్ అనే రకం ఫైబర్ రక్తంలో చక్కెర శాతం పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది కాబట్టి రక్తంలో గ్లూకోజ్ ఆకస్మికంగా పెరగకుండా ఉంటుంది. అలాగే తమలపాకులో ఉండే సహజ యాంటీ డయాబెటిక్ గుణాలు శరీరంలోని ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి. ఈ రెండు కలిపి తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ఉపశమనం లభిస్తుంది.
మెంతులు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలలో పీరిడ్స్ సమయంలో వచ్చే అసమానతలు, నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. తమలపాకులు గర్భాశయాన్ని శుభ్రంగా ఉంచే గుణాన్ని కలిగి ఉండటంతో పాటు, పీరియడ్స్ సమయంలో వచ్చే మెన్స్ట్రుయల్ క్రాంప్స్‌కి ఉపశమనం కలుగుతుంది. ఇది మహిళల సాధారణ ఆరోగ్య సంరక్షణలో సహాయకారి అవుతుంది.
తమలపాకులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది. మెంతుల్లో ఉండే ఫైబర్, యాంటీ యాసిడిక్ లక్షణాలు గ్యాస్, అజీర్ణం, ఛాతీలో మంట వంటి సమస్యలను తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల జీర్ణతంత్రం మెరుగవుతుంది.
మెంతులు సహజంగా రోగ నిరోధక గుణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని బలంగా ఉంచి వ్యాధులను దూరంగా నిలిపే సామర్థ్యాన్ని పెంచుతాయి. తమలపాకులు రక్తప్రసరణను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉండటంతో శరీరంలోని ప్రతి ఒక్క భాగానికి ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. దీని వల్ల శరీరం చురుకుగా మారుతుంది. కీళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యలపై కూడా ఇది మంచి ప్రభావం చూపుతుంది.
తమలపాకులు క్రిమినాశక లక్షణాలను కలిగి ఉండటం వల్ల నోటిలో ఉండే హానికర బ్యాక్టీరియాను తొలగించడంలో సహకరిస్తాయి. ఇది నోటి వాసన, పూత, మౌత్ అల్సర్ వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. మెంతులు కూడా నోటి లోపల వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
ఈ రెండు పదార్థాల ప్రయోజనాలను పొందాలంటే ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక తమలపాకు తీసుకుని రాత్రంతా నానబెట్టిన ఒక టీ స్పూన్ మెంతులను కలిపి బాగా నమిలి మింగాలి. అనంతరం గోరువెచ్చని నీటిని తాగితే శరీరానికి మరింత మేలు జరుగుతుంది. ఈ విధంగా తమలపాకులు, మెంతులను కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
