పిల్లలను కనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే వెంటనే ఈ 4 పనులు చేయడం మానేయండి..

నేటి జీవనశైలికి, ఫెర్టిలిటీకి మధ్య లోతైన సంబంధం ఉంది. గత కొన్నేళ్లుగా గర్భం దాల్చలేని కేసులు దాదాపు 20 శాతం పెరిగాయి.

పిల్లలను కనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే వెంటనే ఈ 4 పనులు చేయడం మానేయండి..
Infertility
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 27, 2023 | 2:38 PM

నేటి జీవనశైలికి, ఫెర్టిలిటీకి మధ్య లోతైన సంబంధం ఉంది. గత కొన్నేళ్లుగా గర్భం దాల్చలేని కేసులు దాదాపు 20 శాతం పెరిగాయి. దీనికి ప్రధాన కారణాలు జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, కాలుష్యం, మారుతున్న జీవనశైలి, గర్భనిరోధక మాత్రల అధిక వినియోగం మొదలైనవి ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. పైన పేర్కొన్న కారణాలు స్త్రీలలో మాత్రమే కాదు, పురుషులలో సంతానోత్పత్తి క్షీణత కూడా కారణం అవుతున్నాయి. 50 శాతం సమస్య మహిళల్లో ఉంటే, 50 శాతం మంది పురుషులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు, కాబట్టి ఇన్ ఫెర్టిలిటీ సమస్యపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మహిళల్లో ఇన్ ఫెర్టిలిటీకి కారణాలు గర్భాశయ ఫైబ్రాయిడ్లు, అడెనోమైయోసిస్, పుట్టుకతో వచ్చే గర్భాశయ వైకల్యాలు, గర్భాశయ అట్రేసియా, గర్భాశయ పాలిప్స్, క్రానిక్ ఎండోమెట్రిటిస్, ట్యూబల్ బ్లాకేజ్,, పిసిఒఎస్ లు మొదలైనవి కారణం కావచ్చు. అలాగే వయస్సు పెరిగే కొద్దీ స్త్రీల అండం నాణ్యత క్షీణించడం ప్రారంభమవుతుంది. దీని వల్ల మహిళల్లో ఇన్ ఫెర్టిలిటీకి గురయ్యే అవకాశం కూడా ఉంది.

పురుషులలో ఇన్ ఫెర్టిలిటీకి కారణాలు చూస్తే, పురుషులలో ఈ సమస్యకు సంబంధించిన కుటుంబ చరిత్ర, వృషణాల సమస్యలు, వీర్య కణాలు తగ్గడం, ఒత్తిడి, ఊబకాయం లేదా శారీరకంగా చురుకుగా ఉండకపోవడం, ధూమపానం మద్యపానం, హార్మోన్లలో అసమతుల్యత, సరిగ్గా నిద్రపోకపోవడం, కాలుష్యం వంటి కారణాలు కారణాలుగా చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి
  1. అధిక బరువు: స్త్రీలలోను పురుషుల్లోనూ అధిక బరువు కారణంగా ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తుతున్నా.యి అధిక బరువు కారణంగా హార్మోనల్ సమస్యలు తలెత్తడం సహజమే ఫలితంగా వాటి ప్రభావం సంతానోత్పత్తి పైన పడుతోంది అందుకే ఎత్తుకు తగ్గ బరువు ఉండటం అనేది అత్యవసరం. ముఖ్యంగా మహిళల్లో అధిక బరువు వల్ల సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరిలో పీసీఓడీ, పీసీఓఎస్ సమస్యలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. సమతుల్యమైన బరువు ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలు నెమ్మదిగా దూరం అవుతాయి.
  2. ధూమపానం: ధూమపానం అనేది పురుషుల్లో స్పర్ము కౌంటుకు శత్రువు వీర్యకణాల సంఖ్యను తగ్గించడంలో ధూమపానం యాక్టివ్ గా పని చేస్తుంది. . భూమపానం చేసేవారిలో వీర్యకణాల సంఖ్య నెమ్మదిగా తగ్గిపోతుంది ఎందుకంటే ఇంకోటి మీ శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది ఫలితంగా వీర్యకణాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. అలాగే స్త్రీలలో సైతం ధూమపానం అలవాటు ఉన్నట్లయితే రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోవడం వంటి సమస్యలు మనం గమనించవచ్చు అందుకే ధూమపానానికి స్త్రీ పురుషులు ఇద్దరు దూరంగా ఉండాలి.
  3. మద్యపానం: మద్యపానం ఫలితంగా స్త్రీ పురుషుల్లో ఫెర్టిలిటీ సమస్యలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి ఆల్కహాల్ అనేది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ముఖ్యంగా పురుషుల్లో హార్మోన్ల సమతుల్యతను ఇది దెబ్బతీస్తుంది సంతానోత్పత్తికి అవసరమైన వీర్యకణాలు మద్యపానం అలవాటు వల్ల పెద్ద ఎత్తున తగ్గిపోతున్నాయి.
  4. జంక్ ఫుడ్: ఎక్కువగా నూనెలో వేయించిన అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల కూడా సంతాన ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్స్ లో వాడే ఆర్టిఫిషియల్ రంగులు, అదేవిధంగా అధిక సోడియం కలిగినటువంటి పదార్థాల కారణంగా ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ లో పెద్ద ఎత్తున వనస్పతి లాంటి ఆయిల్స్ వాడుతూ ఉంటారు. ఇవి ఊబకాయానికి దారితీస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం