బరువు నియంత్రణకు బీట్‌రూట్ ఆకులు.. ఇలా తీసుకుంటే సన్నజాజి తీగలాంటి ఆకృతి మీ సొంతం!
బీట్‌రూట్ గురించి తెలియని వారుండరు. రక్తహీనత నుంచి సంతానోత్పత్తి వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఇది ఏకైక పరిష్కారం. ఈ ఐరన్ రిచ్ ఫుడ్ తక్కువ సమయంలోనే హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడమేకాదు, శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో అందిస్తుంది. అయితే బీట్‌రూట్ దుంపలు మాత్రమేకాదు.. దీని ఆకుల్లో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బీట్‌రూట్ ఆకులను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు..

బీట్‌రూట్ గురించి తెలియని వారుండరు. రక్తహీనత నుంచి సంతానోత్పత్తి వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఇది ఏకైక పరిష్కారం. ఈ ఐరన్ రిచ్ ఫుడ్ తక్కువ సమయంలోనే హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడమేకాదు, శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో అందిస్తుంది. అయితే బీట్‌రూట్ దుంపలు మాత్రమేకాదు.. దీని ఆకుల్లో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బీట్‌రూట్ ఆకులను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆకులలో విటమిన్లు ఎ, సి, బి6, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి బీట్‌రూప్ ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
బీట్‌రూట్ ఆకులలో ఉండే ఫోలేట్ కంటెంట్ పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా వీటిల్లో నైట్రేట్లు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. అవి రక్తపోటును నియంత్రించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. బీట్‌రూట్ ఆకులలో కరిగే, కరగని ఫైబర్ రెండు రకాల విటమిన్లు ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగు బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
బరువు తగ్గడంలో కూడా బీట్‌రూట్ ఆకులు భలేగా పనిచేస్తాయి. వీటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తిన్న తర్వాత చాలాసేపటి వరకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఫలితంగా తక్కువ ఆహారం తీసుకునేందుకు ఉపకరిస్తుంది. తద్వారా సులువుగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బీట్‌రూట్ ఆకులలో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. బీట్‌రూట్ ఆకులలో ఉండే విటమిన్ B6 మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు దీని వినియోగం మెదడు పనితీరును సైతం మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








