Actress: పాకిస్థాన్ క్రికెటర్‌తో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. రూమర్స్ పై రియాక్షన్ ఇదే..
సాధారణంగా సినీతారల పర్సనల్ లైఫ్ గురించి రోజుకో న్యూస్ వైరలవుతుంది. ముఖ్యంగా హీరోయిన్స్ ప్రేమ, పెళ్లి, డేటింగ్ గురించి ఏదోక రూమర్స్ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రమ్ ను పెళ్లి చేసుకోబోతుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్ పై సదరు హీరోయిన్ రియాక్ట్ అయ్యింది.

బాలీవుడ్ హీరోయిన్ సుష్మితా సేన్ తరచుగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వెలుగులోకి వస్తుంది. కొన్నిసార్లు రోహ్మాన్ షాల్ తో, కొన్నిసార్లు లలిత్ మోడీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు సుష్మిత తన ప్రేమ, పెళ్లి గురించి మరోసారి వార్తలలో నిలిచింది. 2010 ప్రారంభంలో, సుష్మిత పేరు పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రమ్‌తో ముడిపడి ఉంది. అంతేకాదు.. ఇద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకోబోతున్నారని పుకార్లు కూడా వచ్చాయి. కానీ సుష్మిత వెంటనే దానిపై స్పందించి ఆ పుకార్లు అబద్ధమని స్పష్టం చేసింది. ఆ సమయంలో సైతం తన ప్రేమ గురించి వచ్చిన రూమర్స్ ను ఖండించారు. సుష్మిత చాలా అందమైన, చాలా మర్యాదగల మహిళ అని అన్నారు. ఏక్ ఖిలాడి ఏక్ హసీనా’ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో వసీం, సుష్మిత కలిసి కనిపించారు.
ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..
ఈ షోలో వారిద్దరూ న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరి గురించి రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత 2013లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాక్ నడిచింది. ఆ సమయంలో సుష్మిత ట్విట్టర్‌లో ఒక పోస్ట్ రాస్తూ, ఆ పెళ్లి వార్తలు అబద్ధమని పేర్కొంది. ‘వసీమ్‌తో నా వివాహం గురించిన వార్తలను నేను చదువుతున్నాను. ఇది నకిలీ వార్త. వసీం అక్రమ్ నా స్నేహితుడు. అతని జీవితంలో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఇలాంటి పుకార్లు అగౌరవంగా ఉంటాయి. ఎవరైనా నా జీవితంలోకి వస్తే, నేను ముందుగా మీకు తెలియజేస్తాను’ అని రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?
2022లో విడుదలైన తన ‘సుల్తాన్: ఎ మెమోయిర్’ పుస్తకంలో వసీం అక్రమ్ సుష్మితా సేన్ గురించి ప్రస్తావించారు. ఆమెతో ప్రేమలో ఉన్నారనే వార్తల్లో నిజం లేదని ఆయన ఈ పుస్తకంలో రాశారు. 2009లో తన భార్య హుమా మరణించిన తర్వాత, తన పేరు చాలా మంది మహిళలతో ముడిపడి ఉందని, వారిలో సుష్మిత ఒకరని కూడా ఆయన అన్నారు. తరువాత, 2013లో వసీం షనేరా అక్రమ్‌ను వివాహం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..




