Allu Arjun: పుష్ఫ2 రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ రిప్లై ఏంటంటే?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ నటించిన అల్లు అర్జున్ 'పుష్ప 2' మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ కు ముందు బన్నీకి ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించాడు విజయ్ దేవరకొండ.

Allu Arjun: పుష్ఫ2 రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ రిప్లై ఏంటంటే?
Vijay Deverakonda, Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Nov 29, 2024 | 7:37 PM

అల్లు అర్జున్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ మరో వారం రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే డిసెంబర్ 05న సుమారు 13 వేలకు పైగా స్క్రీన్లలో పుష్ప 2 రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేశారు మేకర్స్. ఇప్పటికే పాట్నా, చెన్నై, కోచిలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించారు. శుక్రవారం (నవంబర్ 29)న ముంబైలో కూడా ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. డిసెంబరు 1న బెంగళూరులో ఈవెంట్ ఉంది. ఇదిలా ఉంటే పుష్ప 2 రిలీజ్ కు ముందు హీరో అల్లు అర్జున్ కు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ అందించాడు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ. తన ‘రౌడీ’ బ్రాండ్‌ కలెక్షన్స్‌ నుంచి బన్నీకి ఇప్పటికే పలు డ్రెస్సులు పంపించాడు విజయ్. తాజాగా అల్లు అర్జున్ కోసం ‘పుష్ప’ పేరుతో కూడిన టీ షర్ట్‌లను పంపాడు విజయ్. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు బన్నీ. విజయ్ పంపించిన టీషర్ట్ ను ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్‌ చేసిన బన్నీ.. ‘నా స్వీట్‌ బ్రదర్‌.. నీ ప్రేమకు కృతజ్ఞతలు’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి స్పందించిన విజయ్ ‘లవ్‌ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయి’ అని రిప్లై ఇచ్చాడు. కాగా గతంలో పుష్ప 1 రిలీజ్ సమయంలోనూ అల్లు అర్జున్ కు తన రౌడీ బ్రాండ్ టీషర్ట్ లను పంపించాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ చేశాడీ టాలీవుడ్ హీరో.

పుష్ప 1.. ది రైజ్ రిలీజ్ సమయంలోనూ సేమ్ సీన్..

కాగా ‘పుష్ప 2’ సినిమా రన్‌టైమ్‌పై కూడా ఇప్పుడు చర్చ జరిగింది. సినిమా రన్‌టైమ్ చాలా ఎక్కువగా ఉందని, సినిమా మొత్తం డ్యూరేషన్ ‘యానిమల్’ సినిమాకంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘యానిమల్’ సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాలు. కానీ ‘పుష్ప 2’ రన్ లైన్ అంతకంటే ఎక్కువే ఉండబోతోంది. సినిమా ఫస్ట్ హాఫ్ 1 గంట 45 నిమిషాలు అని అంటున్నారు. అయితే సినిమాలో చాలా ట్విస్ట్‌లు ఉన్నాయని, ఎక్కడా బోర్ కొట్టకుండా కథను నిర్మించారని ఇప్పటికే సినిమా చూసిన కొందరు రివ్యూలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవరకొండ ట్వీట్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.