Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: చిరంజీవి ఓ లెజెండ్‌.. ఆయన ఎందరికో స్ఫూర్తి.. విమర్శలు చేయడం సరికాదు: విజయ్‌ దేవరకొండ

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళాశంకర్‌ సినిమా పెద్దగా ఆడలేదు. ఆగస్టు 11న విడుదలైన ఈ మెగా మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ సినిమా ఆడకపోవడం సంగతి పక్కన పెడితే.. ఇదే సందర్భమనుకుని కొందరు మెగాస్టార్‌ను అదే పనిగా విమర్శిస్తున్నారు. చిరంజీవి సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకుంటే మంచిదంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు.

Vijay Devarakonda: చిరంజీవి ఓ లెజెండ్‌.. ఆయన ఎందరికో స్ఫూర్తి.. విమర్శలు చేయడం సరికాదు: విజయ్‌ దేవరకొండ
Chiranjeevi, Vijay Devarakonda
Follow us
Basha Shek

|

Updated on: Aug 22, 2023 | 4:05 PM

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళాశంకర్‌ సినిమా పెద్దగా ఆడలేదు. ఆగస్టు 11న విడుదలైన ఈ మెగా మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ సినిమా ఆడకపోవడం సంగతి పక్కన పెడితే.. ఇదే సందర్భమనుకుని కొందరు మెగాస్టార్‌ను అదే పనిగా విమర్శిస్తున్నారు. చిరంజీవి సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకుంటే మంచిదంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు. వీటిని చూసి మెగాభిమానులతో పాటు కార్తికేయ లాంటి యంగ్‌ హీరోలు బాధపడుతున్నారు. చిరంజీవిని ట్రోల్‌ చేయడం సరికాదంటూ, త్వరలోనే ఆయన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో మన ముందుకు వస్తారంటూ మెగాస్టార్‌కు మద్దతుగా కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ చిరంజీవిపై వస్తోన్న విమర్శలపై స్పందించాడు. ఖుషి సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన విజయ్‌.. తన లాంటి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి రావడానికి చిరంజీవే స్ఫూర్తిగా నిలిచారన్నారు. ‘చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు రావచ్చు. అయితే సరైన దర్శకుడు ఆయన ఎనర్జీని అందుకుంటే.. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసినట్లే మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో మన ముందుకు వస్తారు. చిరు సార్‌ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేశారు. ఆయన వచ్చాకే యాక్షన్‌, డ్యాన్స్‌, పెర్ఫామెన్స్‌ అన్నీ పూర్తిగా మారిపోయాయి. చాలామంది చిరంజీవిని చూసే సినిమాల్లోకి వచ్చాం’ అని విజయ్‌ దేవరకొండ తెలిపాడు.

ఎవరినీ తక్కువగా అంచనా వేయద్దు..

హిట్స్‌, ఫ్లాప్‌ల ఆధారంగా చేసుకుని మెగాస్టార్‌ లాంటి వారిని అంచనా వేయకూడదన్నాడు రౌడీబాయ్‌. ‘ సీనియర్‌ నటులపై సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేయడం సరికాదు. వారు చాలా గొప్పవారు. మనం వారిని గౌరవించాలి. విక్రమ్‌తో కమల్‌ సర్‌, జైలర్‌తో రజనీ సార్‌ని చూడడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మెగాస్టార్‌ కూడా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ కొడతారు’ అని విజయ్‌ తెలిపాడు. ఖుషి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ సినిమా జర్నలిస్టు చిరంజీవి గురించి అడగ్గా ఈ వ్యాఖ్యలు చేశాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం రౌడీ బాయ్‌ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. ముఖ్యంగా చిరంజీవి గురించి రౌడీ బాయ్‌ చెప్పిన మాటలు మెగా ఫ్యాన్స్‌ను ఆనందాన్ని కలగజేస్తున్నాయి. ఇక సమంతతో కలిసి విజయ్‌ నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్‌ 1న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానున్న ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్.. వీడియో ఇదుగో..

విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

 ఖుషి సినిమా ప్రమోషనల్ ఈవెంట్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.