Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: సెల్ఫీ తీసుకోవడంలో రష్మిక స్టైలే వేరు.. అభిమానులను సరికొత్తగా పలకరిస్తోన్న బ్యూటీ..

ఓవైపు వరుస సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే రష్మిక.. నిత్యం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు నెట్టింట ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్లలో రష్మిక స్టైల్ ప్రత్యేకమనే చెప్పుకోవాలి.

Rashmika Mandanna: సెల్ఫీ తీసుకోవడంలో రష్మిక స్టైలే వేరు.. అభిమానులను సరికొత్తగా పలకరిస్తోన్న బ్యూటీ..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 22, 2023 | 4:00 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ఓవైపు వరుస సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే రష్మిక.. నిత్యం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు నెట్టింట ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్లలో రష్మిక స్టైల్ ప్రత్యేకమనే చెప్పుకోవాలి. నిజానికి ఈ బ్యూటీకి కొరియన్ సినిమాలంటే విపరీతమైన ఇష్టం. అందుకే అభిమానుల ముందుకు వచ్చిన ప్రతిసారి వేళ్లతో హార్ట్ సింబల్ చూపిస్తుంటుంది. ఇక సెల్ఫీ తీసుకోవడంలో.. కెమెరాలకు ఫోజులివ్వడంలోనూ విభిన్నంగా ఆలోచిస్తుంటుంది. ఎప్పుడూ నెట్టింట సందడి చేసే రష్మిక.. కొన్నిసార్లు క్రేజీగా తీసుకున్న సెల్ఫీస్.. ఫోటోస్ ఇప్పుడు ఒకసారి చూద్దాం.

గతేడాది రష్మిక పర్యటనలో ఉన్నప్పుడు ఆమె పింక్ బన్నీ హూడీలో స్వీట్ కిస్సింగ్ పౌట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పట్లో ఈ పిక్ నెట్టింట తెగ వైరలయ్యింది. మిర్రర్ ముందు నిలబడి పింక్ హూడీలో క్రేజీగా సెల్ఫీ తీసుకుంది రష్మిక.

అలాగే మరోసారి ఫ్లైయింగ్ కిసింగ్ చేస్తూ సెల్ఫీ తీసుకుంది. అందులో రష్మిక ఫేస్ కొద్దిగానే కనిపిస్తుంది. నాకు సెల్ఫీ ఎలా తీసుకోవాలో తెలియదు. అందుకే ఇలా అంటూ క్యాప్షన్ ఇచ్చింది రష్మిక. ఆ పిక్ ఎలా ఉందో చూసేయ్యండి మీరు.

చాలాసార్లు రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో సెల్ఫీస్ షేర్ చేస్తుంది.అందులో ఎక్కువ శాతం రష్మిక తన కెమెరాకు కిస్ ఇస్తున్నట్లుగా ఫోజులిస్తుంది. అలాగే మనోహరమైన, ప్రశాంతమైన మనస్సుతో అభిమానులను పలకరిస్తుంటుంది.

అలాగే సెల్ఫీ మాత్రమే కాదు.. కెమెరా ముందుకు వచ్చినప్పుడు కూడా రష్మిక చాలాసార్లుగా క్రేజీగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంటుంది. అందులో ఎక్కువ సార్లు ఆమె హార్ట్ సింబల్ చూపించడం చేస్తుంటుంది. నేషనల్ క్రష్ క్రేజీ సెల్ఫీస్ ఎలా ఉన్నాయో చూసేయ్యండి.

ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం పుష్ప 2చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా కనిపంచనుండగా.. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.