అతను చాలా గ్రేట్.. ఎంతో గౌరవంగా.. మర్యాదగా ఉంటాడు..! ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
తెలుగు ప్రేక్షకులకు సహజనటి జయసుధ సుపరిచితమే. సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు అలనాటి హీరోలందరి జోడిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత తల్లిగా.. వదినగా.. అక్కగా ఎన్నో పాత్రలు పోషించారు. వెండితెరపై దాదాపు 50 ఏళ్లుగా ఆమె నట ప్రయాణం కొనసాగిస్తున్నారు.

జయసుధ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజనటిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి తదితర దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించారు జయసుధ. తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ అందాల తార ఇప్పుడు సహాయ నటిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. అయితే గతంలో కంటే ఆమె చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
జయసుధ మాట్లాడుతూ.. తాను సినీ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో కమల్ హాసన్ తో పాటు చిరంజీవి వంటి నటులతో కలిసి పని చేశానని, చిరంజీవి గారితో ‘ఇది కథ కాదు’, ‘ప్రాణం ఖరీదు’ వంటి కొన్ని చిత్రాలలో నటించానని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో, అప్పటికే నలుగురు లేదా ఐదుగురు పెద్ద హీరోలు పరిశ్రమలో స్థిరపడి ఉన్నారని జయసుధ తెలిపారు. అటువంటి పోటీ వాతావరణంలో, కొత్తగా వచ్చిన ఒక వ్యక్తిగా తన స్థానాన్ని ఏర్పరచుకోవడం చాలా కష్టమని ఆమె అన్నారు. ఇది ఫైవ్ వర్సెస్ వన్ గా ఉండేది. అప్పటికే తాను నటిగా కొన్ని సినిమాలు చేయడంతో.. చిరంజీవిని కొత్త అబ్బాయిగా భావించానని చెప్పారు. అయితే, చిరంజీవిలోని సంకల్ప శక్తి, క్రమశిక్షణ ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు.
13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
చిరంజీవి హనుమాన్ భక్తుడని, తన లక్ష్యాలను పక్కా ప్రణాళికతో, భక్తి శ్రద్ధలతో సాధించారని తెలిపారు. ఈ లక్షణాలు చిరంజీవి సక్సెస్ కు కారణం అయ్యాయి అని అన్నారు జయసుధ.. చిరంజీవి కుటుంబం గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తో తనకు ‘బాలు’ సినిమాలో మాత్రమే కలిసి పనిచేసే అవకాశం లభించిందని, ఆయన చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి అని జయసుధ అన్నారు. రామ్ చరణ్ గురించి ప్రస్తావిస్తూ, తండ్రి నుండి నేర్చుకున్న క్రమశిక్షణ, సెట్ లో పెద్దల పట్ల గౌరవం, వారితో మర్యాదగా మాట్లాడటం వంటివి ఆయనలో స్పష్టంగా కనిపిస్తాయని జయసుధ ప్రశంసించారు. చిరంజీవి కుటుంబంలోని వారందరూ అత్యంత వినయంగా ఉంటారని ఆమె అన్నారు. మెగాస్టార్ వంటి బిరుదులు ప్రజలు సృష్టించినవే తప్ప, వారు ఎప్పుడూ స్వయంగా ఆ విధంగా ప్రవర్తించరని, చాలా ఒదిగి ఉంటారని జయసుధ అన్నారు.
వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
