Manchu Manoj: ఆరేళ్ల తర్వాత కెమెరా ముందుకు మంచు మనోజ్.. ‘మళ్లీ అమ్మలాంటి సినిమా దగ్గరికే’ నంటూ ఎమోషనల్
ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు మనోజ్. అదే సమయంలో 'వాట్ ది ఫిష్' అనే కొత్త సినిమాను ప్రకటించాడు. తద్వారా తాను సినిమాలకు దూరమయ్యాడంటూ వస్తోన్న పుకార్లను కొట్టి పారేశాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు మనోజ్. సుమారు ఆరేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన మనోజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌లో కెమెరాకు దండం పెడుతున్న ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి చాలా ఏళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ అనే సినిమాలో చివరిగా కనిపించాడు మనోజ్. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. దీనికి తోడు భార్యతో విడాకులు, తదితర వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యాడు. దీంతో మనోజ్ సినిమాలకు దూరమయ్యాడని, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడని ప్రచారం సాగింది. అయితే గోడకు కొట్టిన బంతిలా మళ్లీ తిరిగొచ్చాడీ యంగ్ హీరో. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగా నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు మనోజ్. అదే సమయంలో ‘వాట్ ది ఫిష్’ అనే కొత్త సినిమాను ప్రకటించాడు. తద్వారా తాను సినిమాలకు దూరమయ్యాడంటూ వస్తోన్న పుకార్లను కొట్టి పారేశాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు మనోజ్. సుమారు ఆరేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన మనోజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌లో కెమెరాకు దండం పెడుతున్న ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘అమ్మ లాంటి సినిమా దగ్గరకు మళ్లీ వచ్చాను. లవ్ యూ ఆల్’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.’మనోజ్ అన్నా కమ్ బ్యాక్.. మీ సినిమా సూపర్ హిట్ కావాలి’ అంటూ అభిమానులు,నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.
వచ్చే ఏడాదిలో ప్రథమార్థంలోనే రిలీజ్..
కాగా సుమారు నాలుగు నెలల క్రితమే ‘వాట్ ది ఫిష్’ సినిమాను ప్రకటించాడు మంచు మనోజ్. టైటిల్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ తర్వాత రిలీజైన ప్రీ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్‌లు కూడా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో వరుణ్ కోరుకొండ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి శక్తికాంత్ కార్తీక్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా క్యాస్టింగ్ , టెక్నీ షియన్స్ డీటెయిల్స్ తెలియనున్నాయి. మరోవైపు వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే వాట్ ది ఫిష్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే యోచనలో ఉన్నారని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వాట్ ది ఫిష్ సినిమాతో పాటు ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు మనోజ్. భాస్కర్ బంటుపల్లి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.




షూటింగులో జాయిన్ అయిన మంచు మనోజ్.. ఎమోషనల్ పోస్ట్
Back to my Amma, CineMA 🙏🏼❤️ Love you all with all my heart ❤️ pic.twitter.com/woQRMveQmK
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 21, 2023
తల్లిదండ్రులతో మంచు మనోజ్ లేటెస్ట్ ఫొటోస్
To the epitome of love and commitment, my dear amma and nanna, on your anniversary. Your love has taught us the true meaning of a soulful connection, and I’m grateful for the love and care you’ve showered upon us. May your love continue to shine brightly forever! ✨❤️… pic.twitter.com/1rxvgv062w
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 29, 2023
పవన్ కల్యాణ్ ‘బ్రో’ సినిమా థియేటర్ లో మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి..
Sending all the best wishes to our @PawanKalyan anna and my darling @IamSaiDharamTej on #BroTheAvathar movie! May your hard work and dedication, along with the brilliant direction of @thondankani, be rewarded with a resounding success. Rooting for you all the way! All the best… pic.twitter.com/ZiwzAYNtLG
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 28, 2023
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలో..
Had a super cooking session with my brothers today at my new home. ❤️#NawinVijayKrishna cooked the best biryani ever 😍 ❤️🙏🏼 @BiryaniTimes‘#Ranjith butter chicken is pure delight to eat. 😋@IamSaiDharamTej babai congratulations once again for the blockbuster #Virupaksha ❤️ pic.twitter.com/vKxtAfelg7
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.