Allu Arjun: కూతురితో కలిసి అల్లరి చేసిన బన్నీ.. అర్హ బుగ్గగిల్లుతూ ఇలా.. వీడియో వైరల్..
బన్నీ కూతురు అల్లు అర్హకు నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన క్యూట్ పిక్స్, అల్లరి వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఇక తన కూతురితో కలిసి బన్నీ చేసే అల్లరి గురించి చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరికి సంబంధించిన క్యూట్ అల్లరి వీడియోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. తాజాగా అర్హతో బన్నీ చేసిన అల్లరి వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. పుష్ప సినిమాతో సౌత్ టూ నార్త్ ఒక్కసారిగా ఆయన క్రేజ్ మారిపోయింది. ఈ సినిమాలో స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో పక్కా ఊరమాస్ లుక్లో మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ప్రస్తుతం ఆయన పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తోన్న ఈ సినిమా కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఫస్ట్ పార్ట్ లో ఉన్న నటీనటులు రష్మిక, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయతోపాటు.. మరికొంత మంది కొత్త నటీనటులు కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక గతంలో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఓవైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న బన్నీ.. బ్రేక్ దొరికితే తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. తన పిల్లలు అయాన్, అర్హతో కలిసి ఎంజయ్ చేస్తుంటారు. వీరికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ బన్నీ సతీమణి అల్లు స్నేహ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
ఇదిలా ఉంటే.. బన్నీ కూతురు అల్లు అర్హకు నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన క్యూట్ పిక్స్, అల్లరి వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఇక తన కూతురితో కలిసి బన్నీ చేసే అల్లరి గురించి చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరికి సంబంధించిన క్యూట్ అల్లరి వీడియోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. తాజాగా అర్హతో బన్నీ చేసిన అల్లరి వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇటీవల జూబ్లీ హిల్స్ లోని అల్లు ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు బన్నీ తన కూతురు అర్హతో కలిసి హాజరయ్యారు. అక్కడ తన కూతురు అర్హ బుగ్గలు లాగుతూ సరదాగా ఆడుకున్నారు బన్నీ. ఆ సమయంలో అర్హ దూరంగా వెళ్లిపోతూ క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
అల్లు ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో తన కూతురు అల్లు అర్హతో సరదాగా ఆడుకున్నారు అల్లు అర్జున్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
View this post on Instagram
View this post on Instagram
ఇప్పటికే బాలనటిగా అర్హ వెండితెరకు పరిచయమైంది. సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమాలో అర్హ మొదటిసారి నటించింది. ఇందులో భరతుడి పాత్రలో కనిపించి మెప్పించింది.
View this post on Instagram
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. గతంలో విడుదలైన పుష్ప 2 ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది.
View this post on Instagram
ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. అయితే ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.