Rashmika-Vijay: భవిష్యత్‌లో మరే మహిళకు జరగకూడదు.. రష్మిక మార్ఫింగ్ వీడియోపై విజయ్ దేవరకొండ
రష్మిక ఫేక్ వీడియో అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ వీడియోను 36 గంటల్లోగా తొలగించాలని, ఎక్కడా కనిపించకూడదని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఇలాంటి మార్ఫింగ్ వీడియోలకు సంబంధించిన నిబంధనలను మరోసారి గుర్తు చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది

ప్రముఖ నటి రష్మిక మందన్న ఏఐ డీప్‌ఫేక్ వీడియోపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులతో సహా అందరూ ఈ చర్యను ఖండిస్తున్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రులు, అమితాబ్ బచ్చన్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్, నాగచైతన్య, మృణాళ్ ఠాకూర్, చిన్మయి, మంచు విష్ణు తదితర ప్రముఖులు రష్మిక మార్ఫింగ్ వీడియోపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆమెకు మద్దతుగా ఉంటామంటూ భరోసానిస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక ఫేక్ వీడియోపై రియాక్ట్ అయ్యాడు. మరో మహిళకు ఇలాంటివి జరగకూడదన్నాడు. కాగా రష్మిక ఫేక్ వీడియో అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ వీడియోను 36 గంటల్లోగా తొలగించాలని, ఎక్కడా కనిపించకూడదని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఇలాంటి మార్ఫింగ్ వీడియోలకు సంబంధించిన నిబంధనలను మరోసారి గుర్తు చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. డీప్ ఫేక్ వీడియోలు క్రియేటింగ్ , షేరింగ్ , సర్క్యులేషన్‌కు సంబంధించిన పెనాల్టీలు, నిబంధనలు గుర్తు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆయా సామాజిక మాధ్యమాల సంస్థలకు అడ్వయిజరీని పంపించింది. దీనిపైనే స్పందించిన విజయ్ దేవరకొండ భవిష్యత్తు కోసం ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు వెంటనే తీసుకోవాలని సూచించాడు.
“ఇది భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన చర్య. ఇలా ఎవరికీ జరగకూడదు. సైబర్ నేరాలను నిరోధించడానికి, సమర్థవంతమైన, సులభంగా యాక్సెస్ చేయగల సైబర్ యూనిట్ అవసరం. దోషులకు శిక్ష పడితే ప్రజలకు మరింత రక్షణ లభిస్తుంది’ అని ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. కాగా విజయ్, రష్మిక గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్నుంచి డేటింగ్‌లో ఉన్నారంటూ వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వైరల్ అయ్యాయి. వివిధ వికేషన్స్‌లో వారి ఫోటోలను మ్యాచ్ చేస్తూ నెటిజన్లు.. తెగ వైరల్ చేశారు. అయితే ఎప్పటికప్పుడు తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు విజయ్, రష్మిక.
ఇక ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు ఇషాన్ కట్టర్ కూడా ఈ విషయంపై స్పందించారు. ‘దీన్ని ఖండిస్తున్నాను. డీప్‌ఫేక్ మంచిది కాదు. అనుమతి లేకుండా శరీరాన్ని, ముఖాన్ని వాడుకోవడం తప్పు అని ఇషాన్ కట్టర్ తెలిపాడు. రష్మిక డీప్ ఫేక్ వీడియో తీసిన వారిని కఠినంగా శిక్షించాలని అమితాబ్ బచ్చన్ కోరారు.
మంచు విష్ణు ట్వీట్..
I strongly support Rashmika, who is one of the many victims of the deep fake controversy video. We at , Movie Artiste Association (MAA) , are deeply concerned about the misuse of technology to create such harmful content. MAA is actively collaborating with legal and AI experts to…
— Vishnu Manchu (@iVishnuManchu) November 8, 2023
రష్మిక మందన్నా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..