TOP9 ET: రికార్డులు బద్దలు కొడుతున్న మహేష్ ‘దమ్ మసాలా’ | ఫీల్డ్‌లో అడుగుపెట్టిన ప్రభాస్
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా ఇండియన్ 2. ఈ మధ్యే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్ ఇచ్చారు శంకర్. ఇండియన్ 2తో పాటు పార్ట్ 3 కూడా ఉంటుందని తెలిపారు ఈయన. 2024లో ఇండియన్ 2 విడుదల కానుంది.. 2025 సంక్రాంతికి పార్ట్ 3 వచ్చే ఛాన్స్ ఉంది. | ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్, లియో లాంటి సెన్సేషనల్ సినిమాలు చేసిన త్రిష.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాగానే చేస్తున్నారు.
01.Gutur Karam
మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అవ్వడమే కాదు.. ఆన్‌లైన్‌లో రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది. క్షణాల్లోనే వైరల్‌గా మారిన ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీకి తమన్ సంగీతమందిస్తున్నారు.
02.Prabhas
మోకాలి సర్జరీ చేయించుకునేందుకు ఫారెన్ వెళ్లిన ప్రభాస్ దాదాపు 45 రోజుల తర్వాత ఇండియాకు వచ్చారు ప్రభాస్. వచ్చీ రాగానే ఆయన వరసగా సినిమా షూటింగ్స్‌తో బిజీ అవ్వాలని చూస్తున్నారు. ప్రస్తుతం సలార్‌తో పాటు మారుతి, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ముందు సలార్ ప్రమోషన్స్ చేసిన తర్వాత.. మిగిలిన సినిమాలకు టైమ్ ఇవ్వనున్నారు ప్రభాస్.
03.Varun Tej
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఘనంగా జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసారు. ఇదిలా ఉంటే వీళ్ల పెళ్లి వీడియోకు సంబంధించిన ఓటిటి హక్కులపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని.. తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దంటూ కోరారు కుటుంబ సభ్యులు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని తెలిపారు మెగా ఫ్యామిలీ.
04.NBK 109
బాలయ్య, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఫైట్ సీక్వెన్స్‌తోనే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్లు ఈ సినిమా కథను సిద్ధం చేసారు బాబీ. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాబీ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మార్చ్ 29, 2024న ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి.
05. Kannappa
న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో కన్నప్ప సినిమా షూటింగ్ జరుగుతోంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుంది. అక్కడి ప్రకృతి, వాతావరణం, అందమైన ప్రదేశాలను అద్భుతంగా చూపించబోతున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి చిత్రాలను ఇక్కడే షూట్ చేశారు.
06.Indian 3
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా ఇండియన్ 2. ఈ మధ్యే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్ ఇచ్చారు శంకర్. ఇండియన్ 2తో పాటు పార్ట్ 3 కూడా ఉంటుందని తెలిపారు ఈయన. 2024లో ఇండియన్ 2 విడుదల కానుంది.. 2025 సంక్రాంతికి పార్ట్ 3 వచ్చే ఛాన్స్ ఉంది.
07.Trisha
ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్, లియో లాంటి సెన్సేషనల్ సినిమాలు చేసిన త్రిష.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాగానే చేస్తున్నారు. ఈ మధ్యే ది రోడ్ అనే ఒక ఫిమేల్ మూవీలోనూ నటించారు ఈ బ్యూటీ. రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ అనేది ఈ మూవీ క్యాప్షన్. అరుణ్ వశీగరన్ తెరకెక్కించిన ది రోడ్ సినిమా నవంబర్ 10 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది.
08.Katrina
రష్మిక మార్ఫింగ్ వీడియోకు సంబంధించిన చర్చ జరుగుతుండగానే మరో నటికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ముఖాన్ని మార్ఫ్ చేసి క్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియోలపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
09. Ananya
మల్లేశం సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల తన ఇమేజ్ మార్చుకునే పనిలో ఉన్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో ట్రెడిషనల్ రోల్స్‌లోనే కనిపించిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ చేస్తున్నారు. గ్లామర్ వరల్డ్‌లో కంటిన్యూ అవ్వాలంటే అన్ని రకాలుగా కనిపించాలి, అందుకే ఆ ఫోటోస్ షేర్ చేశా అన్నారు అనన్య.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.