Chinmayi -Rashmika: డీప్‌ ఫేక్  భయంకరంగా మారబోతోంది.! డీప్ ఫేక్ పై చిన్మయి శ్రీపాద ఆందోళన..

Chinmayi -Rashmika: డీప్‌ ఫేక్ భయంకరంగా మారబోతోంది.! డీప్ ఫేక్ పై చిన్మయి శ్రీపాద ఆందోళన..

Anil kumar poka

|

Updated on: Nov 09, 2023 | 9:59 AM

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ మార్ఫింగ్‌ వీడియో ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై పలువురు స్టార్స్‌ ఇప్పటికే మండిపడిన విషయం తెలిసిందే. ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద తాజాగా ఫైర్‌ అయ్యారు. మ‌హిళ‌ల‌పై జ‌రిగే లైంగిక వేధింపులపై ట్విట్టర్ వేదిక‌గా ప్రశ్నిస్తూ ఉంటుంది. రష్మికకు మద్దతుగా చిన్మయి ట్విట్టర్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ మార్ఫింగ్‌ వీడియో ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై పలువురు స్టార్స్‌ ఇప్పటికే మండిపడిన విషయం తెలిసిందే. ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద తాజాగా ఫైర్‌ అయ్యారు. మ‌హిళ‌ల‌పై జ‌రిగే లైంగిక వేధింపులపై ట్విట్టర్ వేదిక‌గా ప్రశ్నిస్తూ ఉంటుంది. రష్మికకు మద్దతుగా చిన్మయి ట్విట్టర్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది. ప్రతిరోజూ మహిళల శరీరాలు దోపిడీకి గురవుతున్న దేశంలో.. అమ్మాయిలను వేధించేందుకు ఇలాంటివి ఓ సాధనంగా మారుతున్నాయని కామెంట్‌ చేసింది. అమ్మాయిలను భయపెట్టేందుకు, బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు, లైంగికంగా దాడి చేసేందుకు కూడా డీప్‌ఫేక్స్‌ ఓ ఆయుధంగా మారబోతోందని హెచ్చరించింది. అమ్మాయిల గౌరవానికి ప్రమాదంగా మారిన ఏఐ, డీప్‌ ఫేక్‌ లాంటి వాటిపై అవగాహన లేని చిన్న చిన్న గ్రామాల్లో, పట్టణాల్లోని కుటుంబాల పరిస్థితి ఊహకందనిది అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇటీవలే ఒకప్పటి నటి సిమ్రన్‌ మీద కూడా ఇలానే ఏఐ వీడియో వచ్చిందని ఈ సందర్భంగా చిన్మయి గుర్తు చేసింది. కొందరు జైలర్‌ చిత్రంలోని ‘కావాలయ్యా..’ పాటకు సిమ్రన్‌ ముఖాన్ని ఏఐ సాయంతో మార్ఫింగ్‌ చేసిన వీడియోను నటి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తే గానీ మనకు తెలియలేదని అంది. ఇలాంటి ఏఐ, డీప్‌ఫేక్‌, సైబర్‌ నేరాలపై ఫిర్యాదు చేసేలా సాధారణ ప్రజలు, బాలికలకు అవగాహన కల్పించడానికి దేశ వ్యాప్త ప్రచారాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని చిన్మయి అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మార్ఫింగ్‌ ఫొటోలతో అమ్మాయిలను, అప్పు తీసుకున్న మహిళలను వేధిస్తున్న లోన్‌ యాప్స్‌ వాళ్ల అరాచకాలను కూడా ప్రస్తావించింది. ఇప్పుడు డీప్‌ఫేక్ అనేది భయంకరంగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది అని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.