Thriller Movie OTT: ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ఊహించని ట్విస్టులతో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అనుక్షణం ఊహించని ట్విస్టులు.. మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ఉండే చిత్రాలను చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అలాంటి జానర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్.

సినీరంగంలో లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆమె..ఆ తర్వాత రూటు మార్చింది. ఇప్పుడు తెలుగు, తమిళం భాషలలో విలన్ పాత్రలతో అదరగొట్టేస్తుంది. దక్షిణాదిలో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శబరి. గతేడాది మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. ఇందులో గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించగా.. గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ నటనకు ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ఈ చిత్రానికి థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది. ఇక థియేటర్లలో విడుదలై 9 నెలల తర్వాత ఈ చిత్రంలో ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నారు మేకర్స్. రూ.99తో రెంటల్ విధానంతో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను సన్ నెక్ట్స్, ఆహా ఓటీటీల్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.
కథ విషయానికి వస్తే.. సంజన (వరలక్ష్మి శరత్ కుమార్) ధైర్యవంతురాలైన మహిళ. అరవింద్ (గణేష్ వెంకట్రామన్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ అంతకు ముందే అరవింద్ జీవితంలో మరో అమ్మాయి ఉందనే నిజం తెలియడంతో తన కూతురు రియాను (బేబీ నివేక్ష)ను తీసుకుని భర్తకు దూరంగా వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ సూర్య (మైమ్ గోపి) అనే క్రిమినల్ సంజన ఉన్న చోటుకు వస్తాడు. ఆమెను చంపేందుకు దాడి చేస్తాడు. దీంతో అతడిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా.. పోలీసుల విచారణలో అతడు చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో సంజనకు మానసిక సమస్య ఉందని అనుమానిస్తారు పోలీసులు. చివరకు సంజన జీవితంలో ఎలా పరిస్థితులు ఎదురయ్యాయి. . ? చనిపోయిన సూర్య ఎలా వచ్చాడు ? అనేది సినిమా.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన