Thalapathy 66: నాగార్జున మూవీ టైటిల్ పై కన్నేసిన వంశీ పైడిపల్లి.. దళపతి 66కు..

దళపతి విజయ్( Thalapathy Vijay) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ ఆయన సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తుంటాయి.

Thalapathy 66: నాగార్జున మూవీ టైటిల్ పై కన్నేసిన వంశీ పైడిపల్లి.. దళపతి 66కు..
Thalapathy 66
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 17, 2022 | 3:17 PM

దళపతి విజయ్( Thalapathy Vijay) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ ఆయన సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తుంటాయి. ఈమధ్య కాలంలో విజయ్ నటించిన సినిమాలన్నీ అవలీలగా 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేశాయి. రీసెంట్ గా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయంసాధించలేదు. కానీ వసూళ్లు మాత్రం భారీగానే రాబట్టింది. ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోందని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది.

ఇటీవల ఈ సినిమానుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్. గతంలో అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమా టైటిల్ ను ఇప్పుడు విజయ్ సినిమా కోసం అనుకుంటున్నారట. అక్కినేని నాగార్జున సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘వారసుడు’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే టైటిల్ ను విజయ్ సినిమాకోసం పరిశీలిస్తున్నాడట వంశీ పైడిపల్లి. సినిమా కథకు తగ్గట్టుగా వారసుడు టైటిల్ అయితే సరిగ్గా సెట్ అవుతుందని వంశీ భావిస్తున్నాడట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి