Superstar Rajinikanth : యాక్షన్ ఎంటర్టైనర్‌తో రానున్న సూపర్ స్టార్.. అదిరిపోయిన నయా మూవీ టైటిల్

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్  దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నెల్సన్.

Superstar Rajinikanth : యాక్షన్ ఎంటర్టైనర్‌తో రానున్న సూపర్ స్టార్.. అదిరిపోయిన నయా మూవీ టైటిల్
Superstar Rajinikanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 17, 2022 | 2:54 PM

సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) ప్రస్తుతం నెల్సన్  దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నెల్సన్. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సినిమా నిరాశ పరిచినప్పటికీ వసూళ్లు మాత్రం గట్టిగానే రాబట్టింది ఈ మూవీ. ఇక ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నెల్సన్. చివరిగా దర్భార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మంచి హిట్ ను అందుకున్నారు. ఇక  సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో 169 సినిమాగా వస్తున్న ఈ సినిమా టైటిల్ ను తాజాగా రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘జైలర్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

జైలర్ టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ లో రక్తంతో తడిసిన ఓ పెద్ద కత్తి వేలాడదీసి ఉన్నట్టు డిజైన్ చేశారు. టైటిల్ ను బట్టి ఇందులో రజినీ జైలర్ గా కనిపిస్తారని అర్థం అవుతుంది. జైల్లోని ఖైదీల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రజినీ మరో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉండనుందట. ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా అందాల భామ ఐశ్వర్యరాయ్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై ఇప్పటివరకు క్లారిటీ లేదు. జూలై లేదా ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీకి అనిరుద్ సంగీతాన్ని అందించనున్నాడు.

ఇవి కూడా చదవండి
Jailar

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి