Satya Dev’s Godse Movie Review: నిరుద్యోగుల పక్షాన నిలిచే ‘గాడ్సే’

కొన్ని టైటిళ్లు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. అలాంటి వాటిలో గాడ్సే ఒకటి. హీరోకి గాడ్సే అనే పేరేంటి? అసలు ఆ టైటిల్‌ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటూ రిలీజ్‌కి ముందు ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌ జరిగింది.

Satya Dev's Godse Movie Review:  నిరుద్యోగుల పక్షాన నిలిచే 'గాడ్సే'
Godse
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 17, 2022 | 4:22 PM

కొన్ని టైటిళ్లు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. అలాంటి వాటిలో గాడ్సే ఒకటి. హీరోకి గాడ్సే అనే పేరేంటి? అసలు ఆ టైటిల్‌ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటూ రిలీజ్‌కి ముందు ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌ జరిగింది. ఇంతకీ అసలు ఆ సినిమాకి ఆ టైటిల్‌ ఎందుకు పెట్టినట్టు? చదివేయండి.

నటీనటులు: సత్యదేవ్‌, ఐశ్వర్య లక్ష్మి, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, నాగబాబు, సిజు మీనన్‌, వర్గీస్‌, పృథ్విరాజ్‌, నియోల్‌ సేన్‌, ప్రియదర్శి, చైతన్య కృష్ణ, పవన్‌ సంతోష్‌, గురుచరణ్‌ తదితరులు

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్‌

ఇవి కూడా చదవండి

నిర్మాత: సి.కల్యాణ్‌

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సీవీరావు

సంగీతం: శాండి అద్దంకి, సునీల్‌ కశ్యప్‌

కెమెరా: సురేష్‌.ఎస్‌

ఎడిటర్‌: సాగర్‌ ఉండగండ్ల

ఆర్ట్: బ్రహ్మ కడలి

విడుదల: 17.06.2022

గాడ్సే అలియాస్‌ విశ్వనాథ్‌ రామచంద్ర (సత్యదేవ్‌) కొందరు హై ప్రొఫైల్‌ పర్సనాలిటీలను కిడ్నాప్‌ చేస్తాడు. నెగోషియేషన్‌ టీమ్‌ నుంచి వైశాలి అతన్ని డీల్‌ చేస్తుంటుంది. ప్రతి గంటకూ ఓ సారి కొందరు మంత్రులతో, ఎంపీలతో మాట్లాడాలని కోరుతాడు విశ్వనాథ్‌. అలా ఎందుకు చేశాడు? ఫారిన్‌లో బిజినెస్‌ టైకూన్‌గా ఉన్న అతను ఇండియాకి ఎందుకు వచ్చాడు? అతని భార్య షాలిని పరిస్థితి ఏంటి? స్టేట్‌ మినిస్టర్స్ తో, సీఎంతో గాడ్సే కుదుర్చుకున్న డీల్‌ ఏంటి? గాడ్సే ఫ్రెండ్‌ సైంటిస్ట్ కథేంటి? అతని కోసం గాడ్సే ఏం చేశాడు? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు. సత్యదేవ్‌ హైట్‌, వెయిట్‌కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా సూట్‌ అయిన కేరక్టర్‌ గాడ్సే. అతను చెప్పే డైలాగులు, స్క్రీన్‌ ప్రెజెన్స్ మెప్పిస్తాయి. నెగోషియేషన్‌ టీమ్‌ వైశాలి కేరక్టర్‌లో ఐశ్వర్య లక్ష్మి పెర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. మిగిలిన అన్ని కేరక్టర్లకు కూడా ఆర్టిస్టులు పర్ఫెక్ట్ గా సూటయ్యారు.

గాడ్సే తరహా కథ తెలుగు సినిమాకు కొత్తేం కాదు. అప్పుడెప్పుడో జెంటిల్‌మేన్‌, అపరిచితుడు, ప్రతినిధి, శివాజీ సినిమాల్లో ఉన్న కథ ఇలాంటిదే. లైఫ్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్న హీరోలు, తన ఊరికోసం, తనవారి క్షేమం కోసం ఫారిన్‌ నుంచి రిటర్న్ కావడం… తీరా ఇక్కడికి వచ్చాక రాజకీయనాయకుల చేతుల్లో ఇబ్బందులు పడటం, అనుకున్నది సాధించలేకపోవడం తెలుగు స్క్రీన్‌కి కొత్తేం కాదు.

చదివిన చదువులకు తగ్గట్టు కొలువులు ఎంత మంది చేస్తున్నారు? అలాంటప్పుడు ఆ చదువులు ఎందుకు? కెరీర్‌కి పనికొచ్చే చదువులే చదువుకుంటే పోతుంది కదా… అసలు ప్రభుత్వాలు నిరుద్యోగుల కోసం పాస్‌ చేసిన జీఓలను మధ్యలో ఆపుతున్నదెవరు? సూట్‌కేస్‌ కంపెనీల మాటేంటి? రాజకీయనాయకులు నామినేషన్లలో చూపిస్తున్న ఆస్తుల విలువ ఎంత? నిజానికి వారికున్న ఆస్తుల లెక్కలేంటి? వంటి అంశాలను ఆసక్తికరంగానే లేవనెత్తారు డైరక్టర్‌. అక్కడక్కడా సాగదీతగా అనిపించే సన్నివేశాలు, ఎమోషనల్‌గా మెప్పించని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ పంటికింద రాళ్లలాగా అనిపిస్తాయి. రీరికార్డింగ్‌, కెమెరా, లొకేషన్లు బావున్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సొసైటీని ప్రశ్నించే సినిమాల కోవలో నిలుస్తుంది ‘గాడ్సే’. – డా. చల్లా భాగ్యలక్ష్మి