Virinchi Varma: ఏడేళ్ల తర్వాత రంగంలోకి సక్సెస్‏ఫుల్ డైరెక్టర్.. నందమూరి హీరోతో విరించి నెక్ట్స్ ప్రాజెక్ట్ ?..

దర్శకుడిగా విరించికి కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నానితో..మజ్ను సినిమాను రూపొందించారు విరించి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ తర్వాత సైలెంట్ అయ్యారు విరించి.

Virinchi Varma: ఏడేళ్ల తర్వాత రంగంలోకి సక్సెస్‏ఫుల్ డైరెక్టర్.. నందమూరి హీరోతో విరించి నెక్ట్స్ ప్రాజెక్ట్ ?..
Virinchi Varma
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 10, 2023 | 9:06 AM

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించి.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు కొందరు దర్శకులు. అందమైన ప్రేమకథ చిత్రాలు.. మాస్ యాక్షన్ మూవీస్ తెరకెక్కించి భారీ విజయాలను అందుకున్న డైరెక్టర్స్… గత కొన్నేళ్లుగా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా ఉండిపోయారు. అలాంటి వారిలో యంగ్ ఫిల్మ్ మేకర్ విరించి వర్మ. టాలీవుడ్ ప్రేక్షకులకు విరించి వర్మ పరిచయం అవసరం లేదు. తొలి సినిమా ఉయ్యాలా జంపాలతోనే హిట్ అందుకున్నారు. నూతన నటీనటులతో ఆయన తెరకెక్కించిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. దర్శకుడిగా విరించికి కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నానితో..మజ్ను సినిమాను రూపొందించారు విరించి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ తర్వాత సైలెంట్ అయ్యారు విరించి.

మజ్ను సినిమా రిలీజ్ అయ్యి ఏడేళ్లు అవుతున్నా ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. తాజాగా ఆయన మరో మూవీ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. విరించి వర్మ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. 70ఏళ్ల కాలం నాటి ఓ పిరియాడిక్ స్టోరీ లైన్ చెప్పి కళ్యాణ్ రామ్ ని మెప్పించినట్లు తెలుస్తోంది. లైన్ నచ్చడంతో అటు నందమూరి హీరో కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. త్వరలోనే ఈ మూవీ అనౌన్మెంట్ రానుందట.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ సినిమా స్టోరీని పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు ట్రై చేస్తున్నారట విరించి. ఇదిలా ఉంటే.. కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార, అమిగోస్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్స్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. కొంతకాలంగా ఆయన డిఫరెంట్ జానర్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.