AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela: పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఫొటోను స్టేటస్‌గా పెట్టుకున్న ప్రముఖ హీరోయిన్‌.. నెటిజన్స్ ఏమన్నారంటే?

ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యన తెలుగు సినిమాల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య, అక్కినేని అఖిల్‌ ఏజెంట్‌, పవన్‌ కల్యాణ్‌ బ్రో సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ తో టాలీవుడ్‌ ఆడియెన్స్‌ను అలరించిందామె. అయితే ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది ఊర్వశి.

Urvashi Rautela: పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఫొటోను స్టేటస్‌గా పెట్టుకున్న ప్రముఖ హీరోయిన్‌.. నెటిజన్స్ ఏమన్నారంటే?
Urvashi Rautela, Naseem Shah
Basha Shek
|

Updated on: Sep 04, 2023 | 6:51 PM

Share

ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యన తెలుగు సినిమాల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య, అక్కినేని అఖిల్‌ ఏజెంట్‌, పవన్‌ కల్యాణ్‌ బ్రో సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ తో టాలీవుడ్‌ ఆడియెన్స్‌ను అలరించిందామె. అయితే ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది ఊర్వశి. గతంలో టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌తో రిలేషన్‌షిప్‌ వ్యవహారంలో ఆమె పేరు బాగా నానింది. ఆ తర్వాత కూడా తన ఫొటోషూట్స్‌, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉందీ. దీంతో నెటిజన్లు తరచూ ఆమెను ట్రోల్‌ చేస్తునే ఉన్నారు. నిమిషానికి కోటి రూపాయల రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నానంటూ చేసిన వ్యాఖ్యలతో ఇటీవల నెటిజన్ల చేతిలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది ఊర్వశి. తాజాగా మరోసారి ట్రోలింగ్‌ బారిన పడిందీ అందాల తార. వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం పాకిస్థాన్‌, శ్రీలంక వేదికగా ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2023 క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. టోర్నీలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 2) భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. అయితే భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ హీరోయిన్‌ ఊర్వశి రౌతెలా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పాకిస్థాన్ బౌలర్ నసీమ్ షా ఫోటోను స్టేటస్‌గా పెట్టుకుంది.

దీంతో ఊర్వశి పోస్ట్‌ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. నటి ఊర్వశికి పాకిస్థానీ బౌలర్‌పై అంత అభిమానం ఎందుకని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా జిమ్‌లోని టీవీ ఫోటోను ఊర్వశి షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో పాక్ బౌలర్ నసీమ్ షా బాగా హైలైట్ అయ్యాడు. ఈ ఫోటోకు ‘వర్కౌట్ టైమ్’ అని క్యాప్షన్ పెట్టింది ఊర్వశి. కావాలనే ఈ ఫొటోను పోస్ట్ చేసిందని నెటిజన్లు ఊర్వశిపై మండిపడుతున్నారు. కాగా ఊర్వశి ఇలా వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. 2022 దుబాయ్‌ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీ జరుగుతున్నప్పుడు కూడాఇలాగే నసీమ్ షా ఫొటోను షేర్‌ చేసి వార్తల్లో నిలిచింది. ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్‌ నటిస్తోన్న పుష్ప 2 సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో ఊర్వశి నటించనుందని సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

నటి ఊర్వశి రౌతెలా షేర్ చేసిన ఫొటో ఇదే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..