Bigg Boss 7 Telugu: అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ, ప్రియాంక..

బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్‌ నాగార్జున చిరంజీవి పాటతో ఎంట్రీ ఇవ్వడం విశేషం. గాడ్‌ ఫాదర్‌ సినిమాలోని 'మార్‌ మార్‌ తక్కర్‌ మార్‌' పాటకు స్టెప్పులేస్తూ నాగ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఏడో సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా ప్రముఖ సీరియల్‌ నటి ప్రియాంక జైన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టింది. బలగం సినిమాలోని 'పొట్టి పిల్ల పొట్టి పిల్ల' సాంగ్‌కి స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చారామె.

Bigg Boss 7 Telugu: అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ, ప్రియాంక..
Priyanka Jain, Shivaji
Follow us
Basha Shek

|

Updated on: Sep 03, 2023 | 8:08 PM

బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్‌ నాగార్జున చిరంజీవి పాటతో ఎంట్రీ ఇవ్వడం విశేషం. గాడ్‌ ఫాదర్‌ సినిమాలోని ‘మార్‌ మార్‌ తక్కర్‌ మార్‌’ పాటకు స్టెప్పులేస్తూ నాగ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఏడో సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా ప్రముఖ సీరియల్‌ నటి ప్రియాంక జైన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టింది. బలగం సినిమాలోని ‘పొట్టి పిల్ల పొట్టి పిల్ల’ సాంగ్‌కి స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చారామె. తన గ్రేస్‌ ఫుల్‌ డ్యాన్స్‌ తో హోస్ట్‌ నాగార్జునతో పాటు ఆడియెన్స్‌ని ఫిదా చేసిందీ అందాల తార. ప్రియాంక విషయానికొస్తే.. బెంగళూరులో పుట్టి పెరిగిన ప్రియాంక ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో బోలెడు క్రేజ్‌ తెచ్చుకుంది. 2015లో తమిళంలో రంగి తరంగి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే గోలీసోడా సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. ఇక 2018లో చల్తే చల్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా వర్కవుట్‌ కాకపోవడంతో బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ముఖ్యంగా జానకి కలగనలేదు ధారావాహికతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇందులో ఆమె పోషించిన జానకి పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. అంతకుముందు ప్రియాంక నటించిన మౌనరాగం సీరియల్‌ కూడా అందరినీ ఆకట్టుకుంది.

మొదటి కంటెస్టెంట్ గా ప్రియాంక జైన్  ఎంట్రీ..

ఇక బిగ్ బాస్ హౌసులోకి తర్వాతి కంటెస్టెంటుగా ప్రముఖ నటుడు శివాజీ అడుగుపెట్టారు. మొదట చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించారు. తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమ్మాయి బాగుంది, మిస్సమ్మ, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, సత్యభామ, మా ఆయన చంటి పిల్లాడి వంటి హిట్‌ సినిమాల్లో నటించారు శివాజీ. ఇందులో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారాయన. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయాడు. 2018లో వచ్చిన గ్యాంగ్‌స్టర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లో చివరిసారిగా నటించాడు. రాజకీయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. మళ్లీ ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

 చాలా రోజుల తర్వాత హీరో శివాజీ ..  

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే