AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. పవన్‌ ‘ఓజీ’ గ్లింప్స్‌పై ఆర్జీవీ ట్వీట్‌.. ఏం చెప్పారో తెలుసా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం ఓజీ (ఒరిజినల్‌ గ్యాంగస్టర్‌). రన్‌ రాజా రన్‌, సాహో సినిమాలతో స్టైలిష్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుజిత్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పోస్టర్స్‌తో హైప్‌ను క్రియేట్‌ చేశారు ఓజీ మేకర్స్‌. తాజాగా పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. గ్యాంగ్‌స్టర్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌ లుక్‌ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్‌.

Pawan Kalyan: నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. పవన్‌ 'ఓజీ' గ్లింప్స్‌పై ఆర్జీవీ ట్వీట్‌.. ఏం చెప్పారో తెలుసా?
Ram Gopal Varma ,Pawan Kalyan
Basha Shek
|

Updated on: Sep 02, 2023 | 9:12 PM

Share

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం ఓజీ (ఒరిజినల్‌ గ్యాంగస్టర్‌). రన్‌ రాజా రన్‌, సాహో సినిమాలతో స్టైలిష్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుజిత్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పోస్టర్స్‌తో హైప్‌ను క్రియేట్‌ చేశారు ఓజీ మేకర్స్‌. తాజాగా పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. గ్యాంగ్‌స్టర్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌ లుక్‌ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్‌. అభిమానులు ఎలాగైతే పవన్‌ను చూడాలనుకుంటున్నారో అలాగే స్టైలిష్‌గా చూపించారంటూ పలువురు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘హంగ్రీ చీతా’ అనే పేరుతో రిలీజైన గ్లింప్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ లో ఉంది. కాగా పవన్‌పై ఎప్పుడూ నెగెటివిటీతో మాట్లాడే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా ఓజీకి ఫిదా అయ్యాడు. పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేసిన ఆర్జీవీ ‘ ఓజీ గ్లింప్స్ ప్రపంచాన్ని దాటేసింది.. నేను ఇప్పటి వరకు చూసిన పవన్‌ కల్యాణ్‌ ట్రైలర్స్‌లో ఇది అత్యుత్తమం. . హే సుజిత్ మీరు చంపేశారు బ్రో’ అని రాసుకొచ్చారు ఆర్జీవీ. ప్రస్తుతం రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా పవన్‌ ఫ్యాన్స్‌ ఇది చూసి ‘ఇది మేం ఊహించలేదు’ అంటూ రీ ట్వీట్స్‌ చేస్తున్నారు.

రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పినట్లుగానే పవన్‌ కల్యాణ్‌ ఓజీ గ్లింప్స్ ఉందంటున్నారు ఫ్యాన్స్‌. ముంబై గ్యాంగస్టర్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఓజీలో గ్యాంగ్‌ లీడర్‌ ఫేమ్‌ ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, కోలీవుడ్ యంగ్‌ హీరో అర్జున్ దాస్, సీనియర్‌ నటి శ్రియా రెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తోన్నఈ మూవీకి థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం ఈ సినిమా షూటింగ్‌ పూర్తైంది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్

స్పెషల్ రోల్ లో సీనియర్ నటి శ్రియా రెడ్డి..

View this post on Instagram

A post shared by Sriya Reddy (@sriya_reddy)

పవన్ కు బర్త్ డే విషెస్ చెప్పిన ఇమ్రాన్ హష్మీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?
భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?
తరచూ పీడకలలు వస్తున్నాయా? బెడ్‌రూమ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
తరచూ పీడకలలు వస్తున్నాయా? బెడ్‌రూమ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలా?ఈ ఆధ్యాత్మిక అలవాట్లు పాటించండి
మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలా?ఈ ఆధ్యాత్మిక అలవాట్లు పాటించండి