Bigg Boss Telugu 7 Launch Highlights: బిగ్‌బాస్‌లోకి స్టార్ సెలబ్రిటీలు.. మొత్తం కంటెస్టెంట్లు వీరే..

Basha Shek

| Edited By: TV9 Telugu

Updated on: Nov 11, 2023 | 4:32 PM

BB7 Grand Opening Highlights: ఇప్పటికే రిలీజైన బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ప్రోమోలు షోపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సీజన్‌ అంతా 'ఉల్టా పుల్టా'గా ఉంటుందంటూ.. టాస్క్‌లు, గేమ్స్‌ అంతా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసినట్లు ప్రోమోల్లో చెప్పుకొచ్చారు నాగార్జున. అలాగే ఫినాలే రౌండ్‌లో ఇచ్చే బ్రీఫ్‌ కేసు ఆఫర్‌ను ఈసారి ముందుగానే ఇవ్వనున్నారంటూ మరో ట్విస్ట్‌ ఇచ్చారు నాగ్‌. ఏడో సీజన్‌లో పలువురు సినీ సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌజ్‌లో

Bigg Boss Telugu 7 Launch Highlights: బిగ్‌బాస్‌లోకి స్టార్ సెలబ్రిటీలు.. మొత్తం కంటెస్టెంట్లు వీరే..
Bigg Boss 7 Telugu Launch Live Updates

BB7 Grand Opening Highlights: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో బిగ్గెస్ట్‌ టీవీ రియాల్టీ షో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. గత ఆరుసీజన్లలోలాగే తాజా సీజన్‌లోనూ టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ప్రోమోలు షోపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సీజన్‌ అంతా ‘ఉల్టా పుల్టా’గా ఉంటుందంటూ.. టాస్క్‌లు, గేమ్స్‌ అంతా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసినట్లు ప్రోమోల్లో చెప్పుకొచ్చారు నాగార్జున. అలాగే ఫినాలే రౌండ్‌లో ఇచ్చే బ్రీఫ్‌ కేసు ఆఫర్‌ను ఈసారి ముందుగానే ఇవ్వనున్నారంటూ మరో ట్విస్ట్‌ ఇచ్చారు నాగ్‌. ఏడో సీజన్‌లో పలువురు సినీ సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కార్తీక దీపం ఫేమ్‌ మోనిత అలియాస్‌ శోభా శెట్టి, ఆలాగే నటుడు అమర్‌ దీప్‌, ఆట సందీప్‌, ఈటీవీ ప్రభాకర్‌, హీరో శివాజీ, హీరోయిన్‌ ఫర్జానా, ఫేమస్‌ సింగర్‌ దామిని, పల్లవి ప్రశాంత్‌, టేస్టే తేజా, అర్జున్‌ అంబటి, అలాగే క్రీడాకారిణి ఐశ్వర్య, యాంకర్‌ నిఖిల్‌ తదితరులు బిగ్‌బాస్‌-7లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల డీటెయిల్స్‌, లాంఛింగ్‌ లైవ్‌ అప్డేట్స్‌ తదితర వివరాలను ఎప్పటికప్పుడు అందించనుంది టీవీ 9 తెలుగు. సో.. బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ స్టే ట్యూన్డ్‌ హియర్‌..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Oct 2023 06:47 PM (IST)

    దూకుడుగా అధికార బీఆర్ఎస్

    తెలంగాణలో ఎన్నికల ఫీవర్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌ కావడంతో అధికార బీఆర్‌ఎస్‌తో పాటు ప్రతి పక్ష కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో తలమునకలయ్యాయి. అయితే ఈ తెలంగాణ దంగల్‌లో కేసీఆర్‌ నేతృత్వంలోని అధికార బీఆర్ఎస్‌ పార్టీ మిగతా పార్టీల కంటే కొంచెం ముందుగా, అన్నిటికీ మించి దూకుడుగా ఉంటోంది

  • 03 Sep 2023 10:48 PM (IST)

    14వ కంటెస్టెంట్‍గా అమర్‌దీప్ చౌదరి..

    బిగ్‌బాస్‌ హౌస్ సెలబ్రిటీలతో నిండిపోతోంది. 14వ, చివరి కంటెస్టెంట్‌గా జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అతనికి స్వాగతం పలికాడు.

  • 03 Sep 2023 10:46 PM (IST)

    13వ కంటెస్టెంట్‍గా రైతు పల్లవి ప్రశాంత్..

    బిగ్‌బాస్‌లోకి సెలెబ్రిటీలతో పాటు.. కామన్ మెన్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అతనే పల్లవి ప్రశాంత్. రైతుగా, ప్రముఖ యూట్యూబర్‌గా ఎంతో గుర్తింపు పొందిన ప్రశాంత్‌కు బిగ్ బాస్ టీమ్ గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది.

  • 03 Sep 2023 10:13 PM (IST)

    12వ కంటెస్టెంట్‍గా కిరణ్ రాథోడ్

    బిగ్‌బాస్‌లోకి మరో అందాల తార అడుగుపెట్టింది. గతంలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన కిరణ్‌ రాథోడ్‌ 12వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టారు. వీరసింహారెడ్డి మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే పాటకు స్టెప్పులేస్తూ ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

    కిరణ్ రాథోడ్ ఎంట్రీ..

  • 03 Sep 2023 10:11 PM (IST)

    11వ కంటెస్టెంట్ గా నటుడు గౌతమ్ కృష్ణ

    బిగ్‍బాస్ ఏడో సీజన్‌ 11వ కంటెస్టెంట్‍గా ప్రముఖ నటుడు గౌతమ్ కృష్ణ అడుగుపెట్టాడు. ఆకాశ వీధుల్లో సహా మరికొన్ని సినిమాల్లో గౌతమ్ కృష్ణ నటించాడు.

  • 03 Sep 2023 09:48 PM (IST)

    పదో కంటెస్టెంట్‌గా హీరోయిన్‌ రతిక

    బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ పదో కంటెస్టెంట్‌గా హీరోయిన్‌ రతిక ఎంట్రీ ఇచ్చింది. దసరా సినిమాలోని ‘చమ్కీలా అంగీలేసి’ పాటకు సూపర్బ్‌ గా డ్యాన్స్‌ చేస్తూ హౌస్‌లోకి అడుగుపెట్టింది. కాగా కొన్ని సినిమాల్లో హీరోయిన్‌ గా నటించినా పెద్దగా గుర్తింపు రాలేదని రతిక వాపోయింది. అందుకే బిగ్‌బాస్‌లోకి వచ్చానని తెలిపింది.

    అందుకే బిగ్ బాస్ లోకి వచ్చా..

  • 03 Sep 2023 09:43 PM (IST)

    జబర్దస్త్ కమెడియన్ తేజ వచ్చేశాడు..

    బిగ్‌ బాస్‌ తొమ్మిదో కంటెస్టెంట్‌గా జబర్దస్త్‌ కమెడియన్‌ తేజ ఎంట్రీ ఇచ్చాడు. ‘మొరగని కుక్క లేదు, విమర్శించని జనమూ లేరు. ఈ రెండూ లేని ఊరే లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి.. అర్థమైందా రాజా? ఆటకు రెడీ ఈ తేజ’ అంటూ తనదైన శైలిలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనికి హోస్ట్‌ నాగార్జున గ్రాండ్ వెల్కమ్‌ పలికారు.

    తేజకు స్వాగతం పలికిన నాగార్జున

  • 03 Sep 2023 09:17 PM (IST)

    8వ కంటెస్టెంట్‌గా కార్తీక దీపం విలన్‌

    కార్తీక దీపం సినిమాలో మోనిత పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించారు శోభాశెట్టి. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారామె. వారసుడు సినిమాలోని పాటతో శోభా హౌస్‌లోకి అడుగుపెట్టింది. మోనితలా కాకుండా శోభాగా హౌస్‌లోకి వస్తున్నానని పేర్కొంది.

    కార్తీకదీపం విలన్  వచ్చేసిందోచ్

  • 03 Sep 2023 08:53 PM (IST)

    ఏడో కంటెస్టెంట్‌ గా ఆట సందీప్‌..

    బిగ్ బాస్ ఏడో సీజన్‌ లో ఏడో కంటెస్టెంట్ గా ఆట సందీప్ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల నీతోనే డ్యాన్స్‌ రియాలిటీషోలో విజేతగా నిలిచిన సందీప్‌ తన సహజశైలిలో సూపర్బ్‌ స్టెప్పులేస్తూ హౌస్‌లోకి అడుగుపెట్టాడు.

    ఆట సందీప్‌ ఎంట్రీ..

  • 03 Sep 2023 08:33 PM (IST)

    షకీలా ఎమోషనల్‌..

    ప్రముఖ సీనియర్‌ నటి షకీలా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఆరో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. కుటుంబ సభ్యుల చేతిలో తానెన్ని కష్టాలు పడ్డానో అందరి ముందు చెబుతూ ఎమోషనల్ అయ్యిందామె. ఆ బాధను అధిగమించేందుకే సినిమాల్లోకి వచ్చానంటూ కన్నీరు పెట్టుకుందామె.

    షకీలా ఎంట్రీ..

  • 03 Sep 2023 08:23 PM (IST)

    హాట్‌ డ్యాన్స్‌ తో వచ్చేసిన శుభ శ్రీ

    బిగ్‌ బాస్‌ ఐదో కంటెస్టెంట్ గా శుభ శ్రీ అడుగు పెట్టింది. ప్రస్తుతం ట్రెండింగ్‌ లో ఉన్న నేహాశెట్టి సమ్మోహనుడా పాటకు హాట్‌ హాట్‌గా స్టెప్పులేస్తూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారామె. ఈమె ప్రముఖ లాయర్‌ అని హోస్ట్‌ నాగార్జున తెలిపారు.

  • 03 Sep 2023 07:58 PM (IST)

    సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్‌ యావర్‌

    బిగ్ బాస్ తెలుగు 7లోకి నాలుగో కంటెస్టెంట్ గా ప్రిన్స్ యావర్ ఘాటుగా ఎంట్రీ ఇచ్చాడు. సాహోలోని బ్యాడ్ బాయ్ పాటతో అతను ఎంట్రీ ఇచ్చాడు. అయితే దీనిని చూసి నాగార్జున నీపేరు యావరా.. ఓవరా అని చురకలు అంటించాడు.

  • 03 Sep 2023 07:45 PM (IST)

    బాహుబలి సింగర్ దామిని వచ్చేశారోచ్..

    ప్రముఖ టాలీవుడ్ సింగర్ దామిని బాలీవుడ్ హౌస్లోకి అడుగుపెట్టింది. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పాటతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. లేటెస్ట్ గా గాడ్ ఫాదర్, బ్రో సినిమాల్లో కూడా పాటలు పాడింది.

    సింగర్ దామిని ఎంట్రీ

  • 03 Sep 2023 07:32 PM (IST)

    రెండో కంటెస్టెంట్‌గా హీరో శివాజీ..

    ప్రముఖ నటుడు శివాజీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన రాజకీయాలపై తన అభిప్రాయాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే శివాజీ బిగ్‌బాస్‌లో ఏ మేరకు ఫన్‌ అందిస్తాడో చూడాలి..

    హీరో శివాజీ ఎంట్రీ..

  • 03 Sep 2023 07:23 PM (IST)

    బిగ్‌బాస్‌ ఏడో సీజన్ మొదటి కంటెస్టెంట్‍గా ప్రియాంక

    బిగ్‍బాస్ ఏడో సీజన్ మొదటి కంటెస్టెంట్‍గా ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక హౌజ్‌లోకి అడుగుపెట్టారు. బలగం సినిమాలోని ‘పొట్టి పిల్ల’ పాటకు డ్యాన్స్ వేస్తూ బిగ్‌బాస్‌లోకి ఆమె అడుగుపెట్టారు. అనంతరం బిగ్‌బాస్‌ హౌజ్‍ ఎలా ఉందో అందరికీ చూపించింది.

    ప్రియాంక జైన్ ఎంట్రీ..

  • 03 Sep 2023 07:03 PM (IST)

    బిగ్ బాస్ షో ప్రారంభం.. చిరంజీవి పాటతో నాగ్ ఎంట్రీ..

    బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున గ్రాండ్‍గా ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాలోని ‘మార్ మార్ తక్కర మార్’ పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. మరికాసేపట్లో కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పరిచయం చేయన్నారు నాగార్జున.

  • 03 Sep 2023 06:34 PM (IST)

    బిగ్‍బాస్ హౌజ్‍లో లోకి ఆట సందీప్ ఎంట్రీ ఖరారు..

    ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, కొరియో గ్రాఫర్ ఆట సందీప్ బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు అతని సతీమణి జ్యోతి రాజ్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. ‘కొత్త ప్రయాణం.. ఆల్ ది బెస్ట్’ అని అందులో రాసుకొచ్చింది. సో.. ఆట సందీప్ బిగ్ బాస్ ఎంట్రీ ఖరారైనట్టే.

    ఆట సందీప్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

  • 03 Sep 2023 06:11 PM (IST)

    ఈసారి బిగ్‌ బాస్‌ టెలికాస్ట్‌ టైమింగ్స్‌ ఇవే..

    బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ లాంచ్ మరికాసేపట్లో జరగనుంది. ఇక రేపటి నుంచి బిగ్‍బాస్ 7 ఎపిసోడ్‌ ప్రసారమవుతుంది. ప్రతీ రోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ‘స్టార్ మా’ ఛానెల్‍లో బిగ్‌ బాస్‌ ప్రసారంఅవుతుంది. ఇక శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9.30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. ఇక ఓటీటీ విషయానికొస్తే.. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో బిగ్‌బాస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

  • 03 Sep 2023 06:02 PM (IST)

    బిగ్ బాస్ లాంచ్ లో సందడి చేయనున్నయంగ్ హీరోలు

    బిగ్ బాస్ లాంఛింగ్ లో టాలీవుడ్ యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి సందడి చేయనున్నారు. ఖుషి ప్రమోషన్లలో భాగంగా విజయ్ రియాల్టీ షోకు రానుండగా, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ ప్రమోషన్ కోసం హౌస్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు నవీన్. వీరితో నాగ్ సంభాషణలు మామాలుగా ఉండదు మరి..

Published On - Sep 03,2023 6:00 PM

Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే