- Telugu News Photo Gallery Cinema photos Sara Tendulkar look glamorous on traditional look, Photos goes viral
Sara Tendulkar: హీరోయిన్లను తలదన్నేలా.. ట్రెడిషినల్ లుక్‌లో సారా టెండూల్కర్.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. వీటికి ఫాలోవర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. తాజాగా సారా మరికొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్‌ను షేర్ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి.
Updated on: Sep 02, 2023 | 10:31 PM

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. వీటికి ఫాలోవర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. తాజాగా సారా మరికొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్‌ను షేర్ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి.

సారా టెండూల్కర్ ఇంకా నటి కాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సారా ఏ లుక్‌లో కనిపించినా చాలా అందంగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుపడు కొత్త లుక్స్‌లో ఫోటోషూట్‌లు చేస్తూ తన అభిమానులకు ఫ్యాషన్ గోల్స్ ఇస్తుంది.

ఇదిలా ఉంటే సారా అలీఖాన్ త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుందనే చర్చ ఊపందుకుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.

ఇక టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా రిలేషన్‌లో ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే వీరు నెట్టింట తమ పోస్టులపై ఒకరికొకరు కామెంట్లు చేసుకుంటారు.

అయితే శుభ్‌మన్ డేటింగ్ చేస్తోంది సచిన్ కుమార్తె సారాతో కాదని, సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్‌తో అని మరిన్ని రూమర్లు వచ్చాయి. అయితే దీనిపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.