AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs Pakistan: ట్రోలర్స్‌కు బ్యాట్‌తోనే జవాబిచ్చిన హార్దిక్‌.. పాక్‌పై సూపర్‌ ఇన్నింగ్స్‌.. ఫ్యాన్స్‌ ఫిదా

హార్దిక్ క్రీజులోకి దిగే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌లు పెవిలియన్‌కు చేరుకున్నారు. టీమ్ ఇండియా కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్‌ కిషన్‌తో కలిసి పాక్‌ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు హార్దిక్‌. పాకిస్తాన్‌పై అతను త్రుటిలో సెంచరీ కోల్పోయి ఉండవచ్చు. అయితే ఈ ఆటగాడు అవుట్ అయ్యే..

India Vs Pakistan: ట్రోలర్స్‌కు బ్యాట్‌తోనే జవాబిచ్చిన హార్దిక్‌.. పాక్‌పై సూపర్‌ ఇన్నింగ్స్‌.. ఫ్యాన్స్‌ ఫిదా
Hardik Pandya
Basha Shek
|

Updated on: Sep 02, 2023 | 8:33 PM

Share

ఆసియా కప్ 2023లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సూపర్‌ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టీమ్ ఇండియా ఈ ఆల్ రౌండర్ చాలా కష్టమైన సందర్భంలో తనను తాను నిరూపించుకున్నాడు. పాకిస్థాన్‌పై హార్దిక్ పాండ్యా 90 బంతుల్లో 87 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే.. హార్దిక్ క్రీజులోకి దిగే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌లు పెవిలియన్‌కు చేరుకున్నారు. టీమ్ ఇండియా కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్‌ కిషన్‌తో కలిసి పాక్‌ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు హార్దిక్‌. పాకిస్తాన్‌పై అతను త్రుటిలో సెంచరీ కోల్పోయి ఉండవచ్చు. అయితే ఈ ఆటగాడు అవుట్ అయ్యే ముందు 7 ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టాడు. ఐదో వికెట్‌కు ఇషాన్‌ కిషన్‌తో కలిసి 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తద్వారా టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 15వ ఓవర్ వరకు టీమ్ ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయినా.. పాండ్యా క్రీజులోకి దిగిన వెంటనే ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా పాక్ స్పిన్నర్లపై ఒత్తిడి పెంచాడు. అతను కేవలం 30.1 ఓవర్లలోనే టీమ్ ఇండియాను 150 దాటించాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి పాండ్యా 111 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పాండ్యా 62 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్ధ సెంచరీ చేసిన తర్వాత, పాండ్యా తన బ్యాటింగ్ గేర్‌ను మార్చి జట్టును 200కు తీసుకెళ్లాడు. అయితే, పాండ్యా సెంచరీకి చేరువలో ఉండగా, షాహీన్ అఫ్రిది అతనిని ఔట్ చేశాడు.

స్వార్థపరుడన్నారు..

కాగా ఆసియా కప్‌కు ముందు పాండ్యా చాలా ట్రోల్ అవుతున్నాడు. పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా వెస్టిండీస్‌లో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది. టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా ఓడిపోయింది. దీంతో పాండ్యా కెప్టెన్సీ సందేహాలు తలెత్తాయి. కొందరు అతన్ని బయటకు పంపాలని కూడా మాట్లాడారు. అంతే కాదు పాండ్యాను స్వార్థపరుడు అని కూడా పిలిచారు. ముఖ్యంగా తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడని నెటిజన్లు పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు. అయితే ఆసియా కప్‌ ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. కాగా ఈమ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. పాండ్యాతో పాటు ఇషాన్‌ కిషన్‌ (81 బంతుల్లో 82, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌ తో ఆకట్టుకున్నాడు. కాగా ప్రస్తుతం పల్లెకెలలో వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్‌లో ఓవర్లు కుదించవచ్చు. పాక్‌ టార్గెట్‌ కూడా మారిపోవచ్చు.

ఇవి కూడా చదవండి

హార్దిక్ పై ప్రశంసల వర్షం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తమామలకు విద్యుత్ షాక్ పెట్టిన అల్లుడు.. చివరకు..
అత్తమామలకు విద్యుత్ షాక్ పెట్టిన అల్లుడు.. చివరకు..
ఒకటి కాదు, ఏకంగా 2సార్లు ఢీ కొట్టనున్న భారత్, పాక్ జట్లు..?
ఒకటి కాదు, ఏకంగా 2సార్లు ఢీ కొట్టనున్న భారత్, పాక్ జట్లు..?
కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
ఫ్రీ గా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
ఫ్రీ గా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!