AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన ‘బాహుబలి’ సింగర్.. నాగ్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దామిని

ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలోని పచ్చబొట్టేసినా అనే పాట ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సూపర్‌ హిట్‌ పాటకు తన అందమైన గొంతుతో ప్రాణం పోశారు ప్రముఖ సింగర్‌ దామిని భట్ల. టాలీవుడ్‌ తో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషా సినిమాల్లోని పలు పాటలను ఎంతో లయబద్ధంగా ఆలపించింది. కొండపొలం దామిని పాడిన ధమ్‌ ధమ్‌ ధమ్‌ పాటకు ఏకంగా జాతీయ పురస్కారం వచ్చింది.

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన 'బాహుబలి' సింగర్.. నాగ్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దామిని
Singer Damini Bhatla
Basha Shek
|

Updated on: Sep 03, 2023 | 9:23 PM

Share

ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలోని పచ్చబొట్టేసినా అనే పాట ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సూపర్‌ హిట్‌ పాటకు తన అందమైన గొంతుతో ప్రాణం పోశారు ప్రముఖ సింగర్‌ దామిని భట్ల. టాలీవుడ్‌ తో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషా సినిమాల్లోని పలు పాటలను ఎంతో లయబద్ధంగా ఆలపించింది. కొండపొలం దామిని పాడిన ధమ్‌ ధమ్‌ ధమ్‌ పాటకు ఏకంగా జాతీయ పురస్కారం వచ్చింది. అంతకుముందు మెగాస్టార్‌ చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్‌ సినిమాలోని బ్లాస్ట్ బేబీ సాంగ్‌ను ఎంతో స్టైలిష్‌గా పాడిందామె. ఇప్పుడీ సాంగ్‌ తోనే బిగ్‌బాస్‌లోకి బ్లాస్టింగ్‌ ఎంట్రీ ఇచ్చింది దామిని. హౌస్‌లోకి రాగానే హోస్ట్‌ నాగార్జునకు ఒక స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చిందీ బ్యూటిఫుల్‌ సింగర్‌. హార్ట్‌ షేపులో ఉన్న సిరామిక్‌ మగ్‌ను నాగ్‌కు కానుకగా ఇచ్చింది. ఈ సందర్భంగా జాతీయ పురస్కారానికి ఎంపికైన ధమ్‌ ధమ్‌ ధమ్‌ పాటను మరోసారి ఆలపించి నాగార్జునతో పాటు ఆడియెన్స్‌ను అలరించింది దామిని. ఇదే సందర్భంగా దామిని చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను నాగార్జున ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటితో పాటు తనకు భక్తిభావం చాలా ఉందంటూ చెప్పుకొచ్చింది దామిని. అందుకే అప్పుడప్పుడు గుండు కూడా కొట్టించుకుంటానని తెలిపింది. ఈ సందర్బంగా దామిని గుండు కొట్టించుకున్న ఫొటోను నాగ్ స్క్రీన్‌పై చూపించారు.

దామిని భట్లది ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి స్వగ్రామం. ఇక్కడే పుట్టి పెరిగిందామె. అయితే ఆ తర్వాత వీరి కుటుంబం హైదరాబాద్‌కి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయింది. ఇక చిన్నప్పటి నుంచే శాస్ట్రీయ సంగీతంపై ఆసక్తి పెంచుకుంది దామిని. జీ సరిగమప, పాడుతా తీయగా వంటి సింగింగ్‌ కాంపిటీషన్లలో సత్తా చాటింది. ఆ తర్వాత ప్లే బ్యాక్‌ సింగర్‌ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సూపర్‌ హిట్‌ పాటలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. రెహమాన్, ఇళయరాజా, విద్యాసాగర్, దేవి శ్రీ ప్రసాద్, హారిస్ జయరాజ్ మరియు మణిశర్మ వంటి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లతో దామిని పనిచేయడం విశేషం. మరి తన అందమైన గొంతుతో అలరిస్తోన్న బిగ్‌బాస్‌లో ఎలాంటి వినోదం అందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

దామినీ భట్ల ఎంట్రీ…

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

సింగర్ దామినీ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన జింబాబ్వే కెప్టెన్..!
టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన జింబాబ్వే కెప్టెన్..!
కేజీ కోడి మాంసం రెండు కేజీల కూర అవ్వాలంటే.. ఇవి వేస్తే చాలు
కేజీ కోడి మాంసం రెండు కేజీల కూర అవ్వాలంటే.. ఇవి వేస్తే చాలు
కారులో మద్యం తాగితే ఏమవుతుంది..? చట్టం ఏం చెప్తుందో మీరు..
కారులో మద్యం తాగితే ఏమవుతుంది..? చట్టం ఏం చెప్తుందో మీరు..
ఆ తేదీలోగా జీతాలు చెల్లించాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
ఆ తేదీలోగా జీతాలు చెల్లించాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
ఒంటరి పులిపై ఎలుగుబంట్ల దాడి.. చివరికి ఏమైందో చూస్తే షాక్!
ఒంటరి పులిపై ఎలుగుబంట్ల దాడి.. చివరికి ఏమైందో చూస్తే షాక్!
టెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు ఇవే!
టెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు ఇవే!
మొబైల్‌లోనే టోల్ పాస్ పొందవచ్చు.. కేంద్రం అదిరిపోయే ఫీచర్..
మొబైల్‌లోనే టోల్ పాస్ పొందవచ్చు.. కేంద్రం అదిరిపోయే ఫీచర్..
ఫూల్ మఖానా తింటున్నారా..? తెలియక ఈ తప్పు చేశారంటే ప్రమాదం తప్పదు!
ఫూల్ మఖానా తింటున్నారా..? తెలియక ఈ తప్పు చేశారంటే ప్రమాదం తప్పదు!
వర్షాకాలంలో జిడ్డును తొలగించి ముఖాన్ని మెరిపించే న్యాచురల్ టిప్స్
వర్షాకాలంలో జిడ్డును తొలగించి ముఖాన్ని మెరిపించే న్యాచురల్ టిప్స్
పక్షవాతం రాకుండా ఉండాలంటే ఇవి గుప్పెడు గింజలు తింటే చాలు..
పక్షవాతం రాకుండా ఉండాలంటే ఇవి గుప్పెడు గింజలు తింటే చాలు..