Pawan Kalyan: పవన్‌ను మీరే నాశనం చేస్తున్నారు.. పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌పై మండిపడ్డ టాలీవుడ్‌ హీరోయిన్‌

పవన్‌ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్‌ మీడియా వేదికగా పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే క్రమంలో ప్రముఖ హీరోయిన్‌, నటి మాధవీ లత కూడా పవర్‌స్టార్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలిపింది. సోషల్‌ మీడియా వేదికగా...

Pawan Kalyan: పవన్‌ను మీరే నాశనం చేస్తున్నారు.. పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌పై మండిపడ్డ టాలీవుడ్‌ హీరోయిన్‌
Maadhavi Latha, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Sep 04, 2023 | 6:13 PM

తెలుగు రాష్ట్రాల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్‌కు పండగే. అలాంటిది ఆయన పుట్టిన రోజును ఎంత గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారో చెప్పాల్సిన పని లేదు. అలా ఈసారి కూడా పవన్‌ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్‌ మీడియా వేదికగా పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే క్రమంలో ప్రముఖ హీరోయిన్‌, నటి మాధవీ లత కూడా పవర్‌స్టార్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలిపింది. సోషల్‌ మీడియా వేదికగా ‘హ్యాపీ బర్త్‌డే టూ యూ మిస్టర్ పవన్ కల్యాణ్. గాడ్ బ్లెస్ యూ’ అంటూ రాసుకొచ్చింది. ఆమె షేర్‌ చేసిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఆమె ఇలా షేర్‌ చేశారో లేదో పవన్‌ ఫ్యాన్స్‌ మండిపడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బర్త్‌ డే పోస్ట్‌లో మాధవి ‘మిస్టర్‌ పవన్‌ కల్యాణ్‌’ అని సంభోదించడమే ఈ ట్రోలింగ్‌కు కారణం. ఫ్యాన్స్‌ కామెంట్లతో విసుగెత్తిపోయిన మాధవీ లత తిరిగి అదే రేంజ్‌లో కౌంటర్‌ ఇచ్చారు. ‘దీనమ్మ జీవితం.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు కూడా ఇంత రచ్చ చేస్తున్నారు. మీరు అయితే బాయ్‌ఫ్రెండ్ గారు, మొగుడు గారు, తమ్ముడు గారు ఫ్రెండ్ గారు అంటారేమో.. నేను మాత్రం అలా అనను. నా మనసుకు నచ్చితే ఏకవచనంతోనే పిలుస్తాను. మీరు ఏమైనా అనుకోండి. నేను మాత్రం పవన్‌ని అలాగే పిలుస్తాను’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది మాధవీ లత.

ఇవి కూడా చదవండి

కాగా 2008లో నచ్చావులే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది మాధవీ లత. ఆ తర్వాత నానితో కలిసి నటించిన స్నేహితుడా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉసురు, చూడాలని చెప్పాలని, అరవింద్‌ 2 తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే సినిమాలకు దూరమైన మాధవీ లత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీజేపీలో చేరి 2019 సాధారణ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కాగా పవన్‌కు తాను పెద్ద అభిమానిని అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది మాధవీలత.

పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మాధవీలత

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్