800 Movie: మురళీ ధరన్ బయోపిక్ ‘800’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ టీమిండియా దిగ్గజం చేతుల మీదుగా..
శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితంపై ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి '800' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పలు భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమా కోసం క్రికెట్ ప్రేమికులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు '800' ట్రైలర్ విడుదలకు సమయం ఆసన్నమైంది. విశేషమేమిటంటే.. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు క్రికెట్ ప్రపంచ దిగ్గజం..
శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితంపై ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పలు భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమా కోసం క్రికెట్ ప్రేమికులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ‘800’ ట్రైలర్ విడుదలకు సమయం ఆసన్నమైంది. విశేషమేమిటంటే.. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు క్రికెట్ ప్రపంచ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండడం. దీనికి సంబంధించిన సమాచారాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది. సెప్టెంబర్ 5న ముంబైలో ‘800’ ట్రైలర్ లాంచ్ కానుంది . ఈ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ మాత్రమే కాకుండా పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. కాగా ముత్తయ్య మురళీధరన్ పేరు మీద చాలా ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు రిలీజయ్యాయి. అయితే ఇందులో మురళీ జీవితంలో ఎవరికీ తెలియని సంఘటనలను తెరపైకి తీసుకురానున్నారట. టెస్టు క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్. అందుకే ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్ పెట్టారు. ముత్తయ్య మురళీధరన్ వన్డేల్లో 530 వికెట్లు పడగొట్టాడు. 1996లో శ్రీలంక జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు ముత్తయ్య మురళీధరన్ ఆ జట్టులో సభ్యుడు. అతని బౌలింగ్ శైలిపై అనేక అనుమానాలు, సందేహాలు తలెత్తాయి. వాటిని అధిగమించి ముత్తయ్య మురళీధరన్ ఎలా సక్సెస్ అయ్యాడు అన్న అంశాలన్నీ 800 సినిమాలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
ధోని బయోపిక్ తరహాలోనే..
కాగా క్రికెటర్ల జీవితంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. క్రికెట్ ప్రపంచంలో ఘనత సాధించిన మహానుభావుల జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. అందులో చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందుకు మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ‘ఎం.ఎస్.’ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ మంచి ఉదాహరణ. ఇప్పుడు ముత్తయ్య మురళీధరన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ‘800’ సినిమా కూడా అభిమానులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.
తెలుగులో కూడా..
‘800’ చిత్రానికి శ్రీపతి దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ నటుడు మధుర్ మిట్టల్ ‘800’లో ముత్తయ్య మురళీధర్ పాత్రను పోషించారు. మహిమా నంబియార్ భార్య పాత్రలో ఒదిగిపోయారు. తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను సచిన్ టెండూల్కర్ విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపింది చిత్రబృందం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..