Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ మరో ట్విస్ట్‌.. కంటెస్టెంట్లుగా ఆ స్టార్‌ సెలబ్రిటీలు కూడా.. ఎంట్రీ ఎప్పుడంటే?

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్‌ టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఆరు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో ఏడో సీజన్‌ ఆదివారం (సెప్టెంబర్‌ 3) గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అయితే వీరితో పాటు మరికొందరు స్టార్‌ సెలబ్రిటీలు కూడా హౌజ్లోకి కంటెస్టెంట్లుగా వెళ్లనున్నారట.

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ మరో ట్విస్ట్‌.. కంటెస్టెంట్లుగా ఆ స్టార్‌ సెలబ్రిటీలు కూడా.. ఎంట్రీ ఎప్పుడంటే?
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Sep 04, 2023 | 5:01 PM

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్‌ టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఆరు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో ఏడో సీజన్‌ ఆదివారం (సెప్టెంబర్‌ 3) గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అయితే వీరితో పాటు మరికొందరు స్టార్‌ సెలబ్రిటీలు కూడా హౌజ్లోకి కంటెస్టెంట్లుగా వెళ్లనున్నారట. ఏడో సీజన్‌ కోసం మొత్తం 20 మంది సెలబ్రిటీలను కంటెస్టెంట్లుగా ఎంపిక చేశారట మేకర్స్‌. అయితే ఈ సీజన్‌ అంతా ఉల్టా పుల్టాగా ఉందని చెప్పినట్టు ఇప్పుడే అందరినీ లోపలికి పంపిస్తే.. పెద్దగా కిక్కు ఉండదని బిగ్‌బాస్‌ టీమ్‌ భావించిందట. అందుకే శని, ఆదివారాల్లో వచ్చే వీకెండ్‌ ఎపిసోడ్లలో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్లను హౌజులోకి తీసుకొచ్చేలా ప్లాన్‌ వేశారట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఒకవేళ ఇదే వాస్తవమైతే బిగ్‌బాస్‌ షోపై మరిన్ని అంచనాలు పెరిగినట్టే. మరి ఈ 14 మంది హౌజ్‌మేట్స్‌ కాక మిగిలిన ఆ ఆరుగురు కంటెస్టెంట్స్‌ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తల ప్రకారం.. యాంకర్‌ నిఖిల్‌, భోలేషావలి, హీరోయిన్‌ ఫర్జానా, ఫోక్ సింగర్‌ మోహన భోగరాజు, సీరియల్‌ నటి ఐశ్వర్య, అంబటి అర్జున్‌ హౌజ్‌మేట్స్‌ గా రానున్నారని తెలుస్తోంది.

 అందుకే వీకెండ్ ఎపిసోడ్స్ లో  ఎంట్రీ ఇవ్వనున్నరా?

ఈ కంటెస్టెంట్ల లిస్టుపై అధికారిక సమాచారం లేకపోయినా మొత్తమ్మీద 20 కంటెస్టెంట్లు హౌజ్‌లోకి రానున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు హౌజ్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లలో ప్రియాంక జైన్‌ ,శివాజీ, దామినీ భట్ల, ప్రిన్స్ యానర్‌, శుభశ్రీ, షకీలా, ఆట సందీప్‌, శోభా శెట్టి, టేస్టీ తేజ, రతిక, గౌతమ్‌ కృష్ణ, కిరణ్‌ రాథోడ్‌, పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ చౌదరి ఉన్నారు. కాగా ఏడో సీజన్‌ను పూర్తిగా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశామన్న మేకర్స్‌ అందుకు తగ్గట్టుగానే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. సాధారణంగా ఫినాలేలో ఇచ్చే బ్రీఫ్‌ సూట్‌ కేస్‌ ఆఫర్‌ను ఈసారి టాప్‌-5 కంటెస్టెంట్లు అడుగుపెట్టగానే ఇచ్చారు. ప్రియాంక, శివాజీ, దామినీ, ప్రిన్స్‌, శుభశ్రీలకు ఈ ఆఫర్ ఇవ్వగా అందరూ దీనిని రిజెక్ట్‌ చేశారు. తాము టైటిల్‌ కొట్టాలనే ఉద్దేశంతో హౌజ్‌లోకి వచ్చామన్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో.. హౌజ్ లో సందడి చేయనున్న నవీన్ పొలిశెట్టి..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే