Bigg Boss 7 Telugu : 50 మంది ట్రాన్స్‌జెండర్లను కన్నతల్లిలా చూసుకుంటోన్న షకీలా.. బిగ్‌బాస్‌ ఎంట్రీపై ఎమోషనల్‌

షకీలా .. సిల్వర్‌ స్క్రీన్‌పై బోల్డ్‌ క్యారెక్టర్లతో అలరించిన ఈ సీనియర్‌ నటి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళనాడులోని ఓ ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆమె తన స్టార్ డమ్ తో సూపర్ స్టార్లకు షాక్ ఇచ్చారు. వారికి సమానంగా రెమ్యునరేషన్లు తీసుకున్నారు. అయితే  కుటుంబ పోషణ కోసం సినిమాల్లోకి అడుగుపెట్టారు షకీలా. 18 ఏళ్లకే నటిగా మెప్పించారు.

Bigg Boss 7 Telugu : 50 మంది ట్రాన్స్‌జెండర్లను కన్నతల్లిలా చూసుకుంటోన్న షకీలా.. బిగ్‌బాస్‌ ఎంట్రీపై ఎమోషనల్‌
Shakeela In Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Sep 03, 2023 | 9:34 PM

షకీలా .. సిల్వర్‌ స్క్రీన్‌పై బోల్డ్‌ క్యారెక్టర్లతో అలరించిన ఈ సీనియర్‌ నటి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళనాడులోని ఓ ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆమె తన స్టార్ డమ్ తో సూపర్ స్టార్లకు షాక్ ఇచ్చారు. వారికి సమానంగా రెమ్యునరేషన్లు తీసుకున్నారు. అయితే  కుటుంబ పోషణ కోసం సినిమాల్లోకి అడుగుపెట్టారు షకీలా. 18 ఏళ్లకే నటిగా మెప్పించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌ సినిమాల్లో సందడి చేసింది. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్లు తీసుకున్నారు. అయితే సినిమాల్లో బోల్డ్‌గా కనిపించే ఆమె నిజ జీవితంలో కూడా అలాగే ఉందనుకుంటారు చాలామంది. అయితే అది చాలా పొరపాటు.  షకీలా  తన కుటుంబ పోషణ కోసమే సినిమాల్లోకి అడుగుపెట్టానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పైగా సినిమాల్లో తనకు ఎదురైన చేదు అనుభవాలను పలు సందర్భాల్లో పంచుకున్నారు. ఇక నటిగా విరామం ఇచ్చాక పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారామె. ముఖ్యంగా 50 మంది ట్రాన్స్‌జెండర్లకు ఆమె ఆశ్రమిస్తున్నారు. సొంత ఖర్చులతో వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. కాగా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న షకీలా బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. హౌస్‌లోకి రాగానే ఆమె ఎమోషనల్‌ అయ్యారు. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని కన్నీరుమున్నీరయ్యారు.

ట్రాన్స్ జెండర్లను కంటికి రెప్పలా చూసుకుంటూ..

‘ 10వ తరగతి ఫెయిల్‌ కావడంతో నాన్న చితక బాదాడు. కుటుంబ పోషణ కోసమే సినిమాల్లోకి అడుగుపెట్టాను. ఒక మేకప్‌మెన్‌ నన్ను సినిమాల్లో చేర్పిస్తానన్నాడు. అలా ఒకరోజు నేను సిల్క్‌స్మితను చూశాను. ఆతర్వాత ఒక సినిమాలో సిల్క్‌ చెల్లెలిగా నన్ను ఎంపిక చేశారు. ఇక నా కుటుంబ సభ్యులు నన్ను గోల్డ్‌ బాతులా మాత్రమే చూశారు. నా డబ్బులన్నీ మా అక్క చూసుకునేది. అయితే తను మాత్రమే బాగుపడింది. ఒకానొకదశలో నా సినిమాలకు సెన్సార్‌ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇంట్లో ఖాళీగా ఉన్నాను’ అంటూ ఎమోషనల్‌ అయ్యారు షకీలా. ఈ సందర్భంగా సీనియర్‌ నటికి ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చారు నాగార్జున. షకీలాను చూసుకునేవారంటూ షాషా, తంగమ్ అని ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ ని స్టేజీపైకి పిలిపించారు. వారు షకీలాతో తమ అనుబంధాన్ని గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు. తమతో సహా 50 మంది ట్రాన్స్‌జెండర్లను షకీలా కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారంటూ షాషా, తంగమ్‌ ఎమోషనల్‌ అయ్యారు.

ఇవి కూడా చదవండి

అందుకే సినిమాల్లోకి అడుగుపెట్టా..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే