Bigg Boss 7 Telugu: స్టార్ సెలబ్రిటీలతో సందడిగా మారిన బిగ్‌ బాస్‌.. కంటెస్టెంట్ల వివరాలివే

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ప్రారంభమైంది. 'ఉల్టా పుల్టా' అంటూ గత కొన్ని నెలలుగా ఈ రియాల్టీ షోపై ఆసక్తిపెంచిన నాగ్‌ అందుకు తగ్గట్టే కంటెస్టెంట్లను హౌస్‌లోకి పిలిచారు. సినిమాలు, సీరియల్స్‌లో నటించిన ప్రముఖ నటీనటులు కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి అడుగుపెట్టారు.

Basha Shek

|

Updated on: Sep 03, 2023 | 10:34 PM

1 / 8
బిగ్‍బాస్ ఏడో సీజన్ తొలి కంటెస్టెంట్‍గా ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక జైన్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. బలగం సినిమాలోని 'పొట్టి పిల్ల' పాటకు డ్యాన్స్ వేస్తూ బిగ్‌బాస్‌లోకి ఆమె అడుగుపెట్టారు.

2 / 8
గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ప్రముఖ నటుడు శివాజీ బిగ్‍బాస్ ఏడో సీజన్ రెండో కంటెస్టెంట్‍గా హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన తల్లితో ఉన్న మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్‌ అయ్యారు శివాజీ.

3 / 8
బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పాటతో పాపులర్‌ అయిన సింగర్‌ దామిని భట్ల మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. స్టేజి పైకి రావడంతోనే హోస్ట్‌ నాగార్జునుకు ఓ సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది దామిని.

4 / 8
ఇక బిగ్ బాస్ తెలుగు 7లోకి నాలుగో కంటెస్టెంట్ గా మోడల్‌, నటుడు ప్రిన్స్ యావర్ ఘాటుగా ఎంట్రీ ఇచ్చాడు. సాహోలోని బ్యాడ్ బాయ్ పాటతో అతను ఎంట్రీ ఇచ్చాడు. అయితే కండలు తిరిగే దేహంతో అతను ఇచ్చిన పోజులు చూసి యావరా.. ఓవరా అని నాగ్‌ చురకలు అంటించాడు.   కాగా పలు సినిమాల్లో నటించిన లాయర్‌ శుభశ్రీ ఐదో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సమ్మోహనుడా పాటకు ఆమె డ్యాన్స్‌ వేశారు.

5 / 8
ఇక బిగ్‌ బాస్‌ లో ఆరో కంటెస్టెంట్‌గా ప్రముఖ నటి షకీలా అడుగుపెట్టారు. హౌస్‌లో అడుగుపెట్టిన ఆమె తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను షేర్‌ చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు. ఇక  ఏడో కంటెస్టెంట్‌గా ఆట సందీప్ తనదైన శైలిలో హుషారైన స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చారు.

6 / 8
ఇక కార్తీక దీపం సినిమాలో మోనిత పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించిన  శోభాశెట్టి 8వ కంటెస్టెంట్‌గా అడుగపెట్టారు. వారసుడు సినిమాలోని పాటతో శోభా హౌస్‌లోకి అడుగుపెట్టింది. మోనితలా కాకుండా శోభాగా హౌస్‌లోకి వస్తున్నానని పేర్కొంది.

7 / 8
ఇక తొమ్మిదో కంటెస్టెంట్‌గా ప్రముఖ నటి రతిక, 10వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ కమెడియన్‌ తేజ, 11వ కంటెస్టెంట్‍గా గౌతమ్ కృష్ణ, 12వ కంటెస్టెంట్‌గా  కిరణ్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక 13వ కంటెస్టెంట్‌ గా అమర్‌ దీప్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు.

8 / 8
Follow us