- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actor Srihari wife Disco Shanti Emotional interview
‘ఆ బాధ తట్టుకోలేక మద్యానికి బానిసైపోయా.. 3 నెలలు డిప్రెషన్‌లోనే’
దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. 80వ దశకంలో ఐటం సాంగ్స్‌లో నటించి సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతోపాటు పలు భాషల్లో దాదాపు తొమ్మిది వందలకుపైగా చిత్రాల్లో నటించారు. నిజానికి డిస్కో శాంతి అసలు పేరు శాంత కుమారిగా. సినిమాల్లోకి వచ్చాక డిస్కో శాంతిగా ఆమె పేరు మర్చుకున్నారు..
Updated on: Sep 03, 2023 | 5:59 PM

దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. 80వ దశకంలో ఐటం సాంగ్స్‌లో నటించి సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతోపాటు పలు భాషల్లో దాదాపు తొమ్మిది వందలకుపైగా చిత్రాల్లో నటించారు.

నిజానికి డిస్కో శాంతి అసలు పేరు శాంత కుమారిగా. సినిమాల్లోకి వచ్చాక డిస్కో శాంతిగా ఆమె పేరు మర్చుకున్నారు. 1986లో విడుదలైన ‘ఉదయగీతం’ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన డిస్కో శాంతి తొలినాళ్లలో సహాయ నటిగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అనుకోకుండా ఐటెం సాంగ్స్‌లో నర్తించే అవకాశం రావడంతో ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

దాదాపు 11 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోయారు. 1996లో తెలుగు నటుడు శ్రీహరిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహానంతరం సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ కు పరిమితమయ్యారు.

లివర్ సంబంధిత వ్యాధితో నటుడు శ్రీహరి భర్త 2013 అక్టోబర్లో ముంబైలో మరణించిన సంగతి తెలిసిందే. భర్త మరణం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డిస్కో శాంతి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

శ్రీహరి చనిపోయాక ఆ బాధను తట్టుకోలేకపోయానన్నారు. ఆ సమయంలో మద్యానికి బానిసయ్యి డిప్రెషన్‌లోకి వెళ్లానన్నారు. భర్త మరణం తర్వాత మూడు నెలలకు ధైర్యం తెచ్చుకుని తన పిల్లల భవిష్యత్తు కోసం ధైర్యంగా నిలబడ్డానన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో మళ్లీ మామూలు మనిషిని కాగలిగానని నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాగా టాలీవుడ్‌లో చివరి వరకూ కలిసి ఉన్న జంటల్లో శ్రీహరి-డిస్కో శాంతి జంట కూడా ఒకటి.





























