- Telugu News Photo Gallery Cinema photos Dance choreographer make special steps for Sreeleela photos goes attractive Telugu Actress Photos
Sreeleela: శ్రీలీల కోసం స్పెషల్‌గా స్టెప్పులు కంపోజ్.. మరి పాపకు ఆ మాత్రం ఉండాలిగా
నిన్నటిదాకా టాలీవుడ్‌లో ఎంత మంది హీరోయిన్లు స్టెప్పులేసినా, సాయిపల్లవి మీద స్పెషల్ ఫోకస్ ఉండేది. రౌడీ బేబీ స్టెప్స్ చూసి వారెవా అనేవారు. ఇప్పుడు ఆమెకు సరైన పోటీ ఇవ్వడానికి వచ్చేశారు నయా సెన్సేషన్ శ్రీలీల.సాంగ్స్ ని ఓన్ చేసుకుని, ఆమె చేసే డ్యాన్స్ చూసి ముచ్చటపడిపోతున్నారు మేకర్స్. సాంగుల్లో ఆమె కోసం స్పెషల్ స్పేస్ క్రియేట్ చేసి డ్యాన్సులు చేయిస్తున్నారు.చల్ తీసి పక్కన్‌పెట్టు నువ్వు తీస్‌మార్.. మా చిచ్చా వచ్చే కొట్టర కొట్టూ..
Updated on: Sep 03, 2023 | 6:12 PM

నిన్నటిదాకా టాలీవుడ్‌లో ఎంత మంది హీరోయిన్లు స్టెప్పులేసినా, సాయిపల్లవి మీద స్పెషల్ ఫోకస్ ఉండేది. రౌడీ బేబీ స్టెప్స్ చూసి వారెవా అనేవారు. ఇప్పుడు ఆమెకు సరైన పోటీ ఇవ్వడానికి వచ్చేశారు నయా సెన్సేషన్ శ్రీలీల.

సాంగ్స్ ని ఓన్ చేసుకుని, ఆమె చేసే డ్యాన్స్ చూసి ముచ్చటపడిపోతున్నారు మేకర్స్. సాంగుల్లో ఆమె కోసం స్పెషల్ స్పేస్ క్రియేట్ చేసి డ్యాన్సులు చేయిస్తున్నారు.

చల్ తీసి పక్కన్‌పెట్టు నువ్వు తీస్‌మార్.. మా చిచ్చా వచ్చే కొట్టర కొట్టూ.. అంటూ భగవంత్ కేసరి సినిమాలోని వినాయకుడి పాట ఇప్పుడు ఆల్ కార్నర్స్ నుంచి వీర మాస్‌గా వినిపిస్తోంది.

దేవుడి పాటే అయినా, నాచోరే అంటూ ప్రతి ఒక్కరూ కాస్త మాస్‌గానే కాలు కదుపుతున్నారు. బీట్ హుషారుగా ఉంటే, బాలకృష్ణ వేసే స్టెప్పులకు స్పీడ్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది. దాన్ని మ్యాచ్ చేస్తూ మరింత యూత్‌ఫుల్‌గా డ్యాన్స్ చేశారు శ్రీలీల.

ఈ సినిమాలోనే కాదు, ఈ నెల 15న విడుదలకు రెడీ అవుతున్న స్కందలోనూ స్టెప్పులు ఇరగదీశారు. యంగ్‌స్టర్స్ లో డ్యాన్స్ బాగా చేస్తారనే పేరుంది రామ్‌కి. రామ్‌తో పాటు సెట్స్ లో స్టెప్పులు ఇగరదీశారు శ్రీలీల.

ధమాకాలో ఆమె వేసిన డ్యాన్సు చూసి ఇన్‌స్టంట్‌గా ఫ్యాన్స్ అయిపోయారు కుర్రకారు. చూశారుగా.. అదీ సంగతి.. ధమాకాలో ఆమె మాస్ మూమెంట్స్ గమనించిన కొరియోగ్రాఫర్లు, ఆమెకు తగ్గట్టే సరికొత్త స్టెప్పులు కూడా కంపోజ్ చేస్తున్నారు.

స్క్రీన్ మీద ఆ స్టెప్పులు చూసిన వారందరూ ఎక్స్ ట్రా ఆర్డినరీ అని మెచ్చుకుంటున్నారు. నితిన్‌తో ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్‌లోనూ ఆమె వేసిన స్టెప్పులు డ్యాన్స్ లవర్స్ ని ఫిదా చేస్తున్నాయి.




