Sudigali Sudheer- Rashmi: రష్మీతో నాది బ్యూటీఫుల్ జర్నీ.. నా సక్సెస్‌లో ఆమెదే మెయిన్ రోల్: సుడిగాలి సుధీర్
గత కొన్ని రోజులుగా ఈ బ్యూటిఫుల్ జోడీ తెరపై కనిపించడం లేదు. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గాలోడు సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉంటున్నాడు. పెద్దగా టీవీ షోల్లో కనిపించడం లేదు. మరోవైపు రష్మీ కూడా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తోంది. దీంతో సుధీర్- రష్మీని జోడీ పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు.
బుల్లితెరపై సుడిగాలి సుధీర్- రష్మీ గౌతమ్‌ల జోడీకి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జోడీ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్‌కు కనుల పండగే. రీల్ తెరపై ఎన్నోసార్లు ప్రేమికులుగా, దంపతులుగా కనిపించిన సుధీర్- రష్మీలను రియల్ లైఫ్‌లోనూ కపుల్‌గా చూడాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతలా వీరి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ బ్యూటిఫుల్ జోడీ తెరపై కనిపించడం లేదు. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గాలోడు సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉంటున్నాడు. పెద్దగా టీవీ షోల్లో కనిపించడం లేదు. మరోవైపు రష్మీ కూడా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తోంది. దీంతో సుధీర్- రష్మీని జోడీ పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత ఓ టీవీ షోలో జంటగా కనిపించారు సుధీర్- రష్మీ. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉన్న నిజమేనే చెబుతున్నా జానే జానా పాటకు ఈ బ్యూటిఫుల్ జోడి కలిసి డ్యాన్స్ చేసి ఆడియెన్స్‌ను అలరించారు. దీని తర్వాత రష్మీతో తనకున్న అనుబంధంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు సుధీర్
‘ రష్మీతో నాదిబ్యూటీఫుల్ జర్నీ. బేసికల్‌గా ఆమె చాలా సెన్సిటివ్. హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆమె నాకు అందరికంటే ఎక్కువ మేం బయటకు వెళ్లినా.. మా ఫ్యామిలీతో బయటకు వెళ్లినా మా జోడి గురించే ఎక్కువగా అడుగుతుంటారు. నా బ్యూటిఫుల్ జర్నీలో, సక్సెస్‌లో రష్మీదే మెయిన్ రోల్. కెరీర్‌లో నేను ముందుకెళ్లడానికి జబర్దస్త్‌లో నా కామెడీ స్కిట్స్‌తో పాటు రష్మీ పాత్ర చాలా ఉంది. ఆమెతో చేసిన ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, స్కిట్స్.. ఇలా అన్నీ సక్సెస్ అయ్యాయి. అందుకు రష్మీకి థ్యాంక్స్’ అని చెప్పిన సుధీర్ చివరలో ‘ఐమిస్‌యూ’ అని చెప్పడంతో రష్మీ ఎమోషనలైంది. ప్రస్తుతం సుధీర్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక ఇదే షోలో ఈ ప్రేమ పక్షులు ఇలా గాలిలోనే ఎగురుతాయా? లేదా ఒకే గూటికి చేరుకుంటాయా? అని గెటప్ శీను అడిగాడు. అయితే సుధీర్- రష్మీ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు.
సుధీర్- రష్మీల జోడికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
సుడిగాలి- సుధీర్ ల ఫొటోస్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..