Papam Pasivadu: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ కామెడీ వెబ్ సిరీస్‌.. ‘పాపం పసివాడు’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ప్లే బ్యాక్‌ సింగర్‌గా, హోస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీరామచంద్ర. పలు సూపర్‌ హిట్‌ పాటలను అద్భుతంగా ఆలపించిన అతను ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో తో హోస్ట్‌గానూ సత్తాచాటాడు. ఇప్పుడు నటుడిగా సిల్వర్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఓ కామెడీ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్‌ ముందుకు రానున్నాడు. శ్రీరామచంద్ర ప్రధాన పాత్రలో నటిస్తోన్న  లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌ పాపం పసివాడు

Papam Pasivadu: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ కామెడీ వెబ్ సిరీస్‌.. 'పాపం పసివాడు' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Papam Pasivadu Web Series
Follow us
Basha Shek

|

Updated on: Sep 04, 2023 | 3:30 PM

ప్లే బ్యాక్‌ సింగర్‌గా, హోస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీరామచంద్ర. పలు సూపర్‌ హిట్‌ పాటలను అద్భుతంగా ఆలపించిన అతను ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో తో హోస్ట్‌గానూ సత్తాచాటాడు. ఇప్పుడు నటుడిగా సిల్వర్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఓ కామెడీ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్‌ ముందుకు రానున్నాడు. శ్రీరామచంద్ర ప్రధాన పాత్రలో నటిస్తోన్న  లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌ పాపం పసివాడు. రాశీసింగ్‌, గాయత్రి చాగంటి, శ్రీవిద్యా మహర్షి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్‌ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్‌కు రానుంది. సెప్టెంబర్‌ 29 నుంచి పాపం పసివాడు వెబ్‌ సిరీస్‌ ఆహా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేశారు ఆహా మేకర్స్‌. ఇందులో భాగంగా తాజాగా పాపం పసివాడు సిరీస్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో కన్ఫ్యూజన్‌ క్రాంతి అనే పాత్రలో కనిపించనున్నాడు శ్రీరామచంద్ర. ‘వీని పేరు క్రాంతి. కన్ఫ్యూజన్ తక్కువ. క్లారిటీ చాలా తక్కువ. చిన్నప్పుడు అమ్మాయి ఇచ్చిందా లవ్‌ లెటరా? లీవ్‌ లెటరా? ‘ అన్న డైలాగ్‌ను బట్టే అర్థం చేసుకోవచ్చు ఇదొక కన్ఫ్యూజన్‌ కామెడీ సిరీస్‌. ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజ్ అయ్యే క్రాంతి ఒక అమ్మాయిని చూసి ఇష్టపడడం, మరో అమ్మాయి అతనిని ఇష్టపడడం, ఈ ఇద్దరినీ కాదని ఇంకో అమ్మాయి వచ్చి చచ్చినా నేనే నచ్చానని చెప్పాలంటూ తుపాకీతో బెదిరించడం.. ఇలా ఆద్యంతం కామెడీ సన్నివేశాలతో కట్ చేసిన టీజర్‌ అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది.

ఇవి కూడా చదవండి

పాపం పసివాడు వెబ్‌ సిరీస్‌లో మొత్తం 5 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఈ సిరీస్‌కు లలిత్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వీకెండ్ షో బ్యానర్‌పై అఖిలేష్ వర్ధన్ పాపం పసివాడును నిర్మించారు. కైషోర్ కృష్ణ సహ దర్శకుడిగా, గౌకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. నిఖిల్‌ స్పై సినిమాకు దర్శకత్వం వహించిన గ్యారీ బీహెచ్ ఈ సిరీస్ కు ఎడిటర్ కాగా, విజయ్‌ మక్కెన ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. జోస్‌ జిమ్మీ సంగీతం సమకూర్చారు. ఇప్పటివరకు సింగర్‌గా, హోస్ట్‌గా ఆకట్టుకున్న శ్రీరామచంద్రం పాపం పసివాడులో సరికొత్త అవతారంలో కనిపించనున్నారని, ఇది అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందంటున్నారు మేకర్స్‌.

‘పాపం పసివాడు’ టీజర్

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

కన్ఫ్యూజన్ క్రాంతి ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడితే..

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే