Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మొదలైన లవ్ ట్రాక్.. కన్నీళ్లు పెట్టుకున్న నటి..
ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్స్ వెళ్లారు. వీరిలో హీరో శివాజీ, సింగర్ దామిని, పల్లవి ప్రశాంత్, శుభ శ్రీ, నటి షకీలా, శోభా శెట్టి, ఆట సందీప్, అమర్ దీప్, టేస్టీ తేజ, రథిక , కిరణ్ రాథోడ్ ఉన్నారు. అయితే వీరు హౌస్ మేట్స్ కాదు అని నాగార్జునా ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో నుంచి కంటెస్టెంట్స్ గా కొంతమంది సెలక్ట్ అవుతారని వారు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అవుతారని తెలిపారు నాగ్. దాంతో హౌస్ మేట్స్ మధ్య పోటీ తొలి రోజు నుంచే మొదలైంది. ఇక మొదటగా వెళ్లిన ఐదుగురు కంటెస్టెంట్స్ లోనే 35 లక్షలు ఆఫర్ ఇచ్చి బయటకు రావచ్చు అని తెలిపారు నాగార్జున. .కానీ ఎవ్వరు ఆ ఆఫర్ ను తీసుకోలేదు.
బిగ్ బాస్ సీజన్ 7 హుషారుగా మొదలైంది. గతకొద్దిరోజులుగా ఉన్న ఆసక్తికి తెరపడింది. బిగ్ బాస్ హౌస్ లోకి ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్స్ వెళ్లారు. వీరిలో హీరో శివాజీ, సింగర్ దామిని, పల్లవి ప్రశాంత్, శుభ శ్రీ, నటి షకీలా, శోభా శెట్టి, ఆట సందీప్, అమర్ దీప్, టేస్టీ తేజ, రథిక , కిరణ్ రాథోడ్ ఉన్నారు. అయితే వీరు హౌస్ మేట్స్ కాదు అని నాగార్జునా ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో నుంచి కంటెస్టెంట్స్ గా కొంతమంది సెలక్ట్ అవుతారని వారు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అవుతారని తెలిపారు నాగ్. దాంతో హౌస్ మేట్స్ మధ్య పోటీ తొలి రోజు నుంచే మొదలైంది. ఇక మొదటగా వెళ్లిన ఐదుగురు కంటెస్టెంట్స్ లోనే 35 లక్షలు ఆఫర్ ఇచ్చి బయటకు రావచ్చు అని తెలిపారు నాగార్జున. .కానీ ఎవ్వరు ఆ ఆఫర్ ను తీసుకోలేదు.
ఇక మొదటి రోజు బిగ్ బాస్ హౌస్ లో ఎలా గడిచిందంటే.. ఆదివారం 14 మంది హౌస్ మేట్స్ ఇంట్లోకి వెళ్లడంతో మొదటి ఎపిసోడ్ కు ఎండ్ పడింది. ఇక సోమవారం రోజున నామినేషన్స్ మొదలయ్యాయి. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టి బిగ్ బాస్ హౌస్ లో కి ఎంట్రీ ఇచ్చాడు, లేడీ లక్కీ అనే టాస్క్ లో భాగంగా హౌస్ లో ఉన్నవాళ్లు వాళ్లకు నచ్చిన అమ్మాయిలకు బ్యాండ్ కట్టాలని టాస్క్ ఇచ్చాడు నవీన్. దాంతో తేజ షకీలాకు, సందీప్ ప్రియాంక జైన్ కు, ప్రిన్స్ యవర్ కిరణ్ రాథోడ్ కు, పల్లవి ప్రశాంత్ రథికకు, శివాజీ శుభ శ్రీకి , గౌతమ్ కృష్ణ దామినికి, అమర్ దీప్ శోభా శెట్టికి బ్యాండ్ కట్టారు.
ఇక బిగ్ బాస్ లో మొదట లవ్ ట్రాక్ మొదలైంది. ప్రశాంత్, రథిక మధ్య మాటలు కలిశాయి. అసలు బిగ్ బాస్ లోకి ఎందుకు రావాలనుకున్నావ్ అంటూ రథిక ప్రశాంత్ ను అడిగింది. ఫస్ట్ లో బిగ్ బాస్ లోకి వెళ్లాలనుందని ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశా.. కానీ అందరు నన్ను తిట్టారు. దాంతో ఆ వీడియో డిలీట్ చేశాను. అప్పుడే బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్. మరో వైపు శోభ శెట్టి నైట్ టైం లో ఒక్కతే కూర్చొని వీక్ అవ్వదు.. బీ స్ట్రాంగ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.