Sneha: 20 ఏళ్ల తర్వాత ఆ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న స్నేహ..
ఆమె కమర్షియల్ సినిమాల్లోనే కాదు భక్తి రస చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. సౌందర్య తర్వాత అలాంటి క్రేజ్ తెచ్చుకున్నారు స్నేహ. ఇక పెళ్లి తర్వాత స్నేహ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు స్నేహ. అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్య మూర్తి సినిమాలో స్నేహ నటించారు. అలాగే పలు సినిమాల్లో నటించారు.
సీనియర్ హీరోయిన్ స్నేహ చాలా మంది ప్రేక్షకులకు ఫెవరెట్ హీరోయిన్. ఆమె నటించిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగులో స్నేహ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె కమర్షియల్ సినిమాల్లోనే కాదు భక్తి రస చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. సౌందర్య తర్వాత అలాంటి క్రేజ్ తెచ్చుకున్నారు స్నేహ. ఇక పెళ్లి తర్వాత స్నేహ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు స్నేహ. అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్య మూర్తి సినిమాలో స్నేహ నటించారు. అలాగే పలు సినిమాల్లో నటించారు. ఇక తమిళ్ లోనూ ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు స్నేహ ఓ భారీ ఆఫర్ ను అనుకుందని కోలీవుడ్ నుంచి టాక్ వినిపిస్తుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆ హీరో సినిమాలో నటిస్తున్నారట స్నేహ. ఇంతకు ఆ హీరో ఎవరో తెలుసా.. ఆయనే దళపతి విజయ్.
దళపతి విజయ్ ప్రస్తుతం లియో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను కంప్లీట్ యాక్షన్ ఎంటర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు లోకేష్. విక్రమ్ లాంటి సినిమా తర్వాత లోకేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమానుంచి ఓ క్రేజీ అప్డేట్ ప్రేక్షకులకు మరింత కిక్ ఇచ్చింది.
View this post on Instagram
ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. లియో సినిమాలో విజయ్ తండ్రి, కొడుకులుగా కనిపించనున్నాడు. ఇందులో కొడుకు పాత్రకు త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. తండ్రి పాత్రకు స్నేహ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ముందుగా ఈ పాత్ర కోసం జోతికను ఎంపిక చేశారట.. కానీ ఆమె ప్లేస్ లో ఇప్పుడు స్నేహను తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.