Aarti Chabria: నెలక్రితమే అమ్మయ్యాను.. ట్విస్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. బిడ్డ పేరేంటో తెలుసా?
బాలీవుడ్ ప్రముఖ నటి, టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా ట్విస్ట్ ఇచ్చింది. ఇటీవల ఆమె బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. దీంతో ఆర్తి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిందామె

బాలీవుడ్ ప్రముఖ నటి, టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా ట్విస్ట్ ఇచ్చింది. ఇటీవల ఆమె బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. దీంతో ఆర్తి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిందామె. ఇప్పటికే తాను బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు పూర్తయిందని తెలిపింది. మార్చి 4వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించిన ఆర్తి .. తనకు యువన్ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఆర్తి చాబ్రియా. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆర్తి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఆర్తి చాబ్రియా వయసు సుమారు 41 ఏళ్లు. 2019లో ఆమె విశారద్ బీదాస్సీతో కలిసి పెళ్లిపీటలెక్కింది. ఇప్పుడీ బంధానికి ప్రతీకగానే యువన్ ను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఆర్తి దంపతులు. అయితే యువన్ పుట్టక ముందే ఆర్తికి గర్భస్రావం అయ్యిందట. అందుకే తన ప్రెగ్నెన్సీ గురించి ముందుగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు ఈ ముద్దుగుమ్మ తెలిపింది.
‘ఈ ఫోటో మిమ్మల్ని మోసం చేయదు. ఎందుకంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు. అమ్మ కావాలనుకుంటున్న మహిళలకు.. ఆ కోరిక తీరనప్పుడు పడే బాధ, కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా కష్టాలు అనుభవించాను. నేను ఎప్పుడు నవ్వుతూ, అందంగా కనిపించగలను. కాబట్టి ఇది చాలా సులభమైన, తేలికైన విషయమని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ చివరికి ఆ భగవంతుడు నా పట్ల దయతో ఉన్నాడు. మనం కోరుకున్న దానికోసం ఒత్తిడికి దూరంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది.’ అని రాసుకొచ్చింది ఆర్తి.
బాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన ఆర్తి చాబ్రియా టాలీవుడ్ ఆడియెన్స్ కు కూడా సుపరిచితమే. మధుర క్షణం, ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి తదితర సినిమాల్లో నటించింది. వెంకటేష్ నటించిన చింతకాయల రవి మూవీలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇక తెలుగులో చివరగా గోపి గోడ మీద పిల్లి చిత్రంలో నటించింది. ఇందులో అల్లరి నరేశ్ హీరోగా నటించాడు.
View this post on Instagram
ఆర్తి చాబ్రియా పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







