AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishita Dutta: మరోసారి తల్లైనా టాలీవుడ్ హీరోయిన్.. రెండో బిడ్డకు జన్మనిచ్చిన ముద్దుగుమ్మ..

తెలుగు సినిమా పరిశ్రమలో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతూ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. అలాగే మరికొంత మంది ఒక్క మూవీ చేసి సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంటారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. తెలుగు అడియన్స్ కు ఇష్టమైన హీరోయిన్..

Ishita Dutta: మరోసారి తల్లైనా టాలీవుడ్ హీరోయిన్.. రెండో బిడ్డకు జన్మనిచ్చిన ముద్దుగుమ్మ..
Ishita Dutta
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2025 | 8:35 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఇషితా దత్తా. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో జనాల హృదయాలను దోచుకుంది. యంగ్ హీరో తనీష్ నటించిన చాణక్యుడు మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. కానీ హిందీలో మాత్రం అనేక సినిమాల్లో కనిపించింది. కేవలం సినిమాలే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ సైతం చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. వీరిద్దరు కలిసి 2016లో రిష్టన్ కా సౌదాగర్-బాజిగర్ అనే సీరియల్ చేశారు. ఆ సమయంలోనే తన తోటి నటుడు వత్సల్ సేథ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2023లో బాబు జన్మించారు. ఇక ఇషితా మరోసారి తల్లైంది. తమకు మహాలక్ష్మీ పుట్టిందంటూ ఈ జంట సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

“మేము ఇద్దరి నుంచి నలుగురిగా మారిపోయాం. ఇప్పుడు మా ఫ్యామిలీ సంపూర్ణమైంది. నాకు కూతురు పుట్టింది” అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వత్సల్ మాట్లాడుతూ.. “తల్లిదండ్రులుగా, మా కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మేము నిర్ణయించుకున్నాము. నేను నా కొడుకు, నా భార్యను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ ఇద్దరి పట్ల నా నుంచి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :  Tollywood : 14 ఏళ్లకే ఇండస్ట్రీని రూల్ చేసింది.. 16 ఏళ్లకే జాతీయ అవార్డ్.. 21 ఏళ్ల వయసులోనే ఊహించని మరణం..

Mehreen Pirzadaa: ఎఫ్ 2 మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా అయ్యిందో చూడండి..

ఇదిలా ఉంటే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇషితా దృశ్యం సినిమాతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. అజయ్ దేవగణ్, శ్రియా కలిసి నటించిన ఈ చిత్రంలో ఇషితా కీలకపాత్ర పోషించింది. ఇందులో టబు సైతం ముఖ్య పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. దృశ్యం 3లోనూ ఇషితా నటించనున్నట్లు సమాచారం.

ఇషితా దత్తా ఇన్ స్టా పోస్ట్.. 

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..