- Telugu News Photo Gallery Cinema photos Senior heroes like Aamir Khan chiranjeevi kamal haasan suffering with age gap for selecting heroine
ఏజ్ గ్యాప్ సమస్య లో చిక్కుకుంటున్న సీనియర్ హీరోలు.. ఆ లిస్ట్ లోకి చేరిన మరొక స్టార్
మొన్న మొన్నటి వరకు కమల్‌హాసన్ ఫేస్ చేసిన సేమ్ ఇష్యూని ఇప్పుడు ఆమీర్‌ఖాన్ డీల్ చేస్తున్నారు. కాకపోతే రీసెంట్ పాస్ట్ లో కమల్ స్పందించలేదు.. ఇప్పుడు ఆమీర్ ఓపెన్ అయ్యారు అంతే తేడా.. ఇంతకీ ఇష్యూ ఏంటి? కమల్ ఏజ్ ఏంటి? త్రిష వయసెంత? అసలు వారిద్దరినీ స్క్రీన్ మీద పెయిర్ చేయాలని ఎందుకు అనిపించింది?
Updated on: Jun 11, 2025 | 10:00 AM

కమల్ ఏజ్ ఏంటి? త్రిష వయసెంత? అసలు వారిద్దరినీ స్క్రీన్ మీద పెయిర్ చేయాలని ఎందుకు అనిపించింది? అంత ఏజ్ గ్యాప్ ఎందుకుండాలి? ఆయన ఏజ్‌కి తగ్గ హీరోయిన్లనే సెలక్ట్ చేసుకోవచ్చు కదా.. అన్నది మొన్న మొన్నటి వరకు నడిచిన టాపిక్.

స్క్రీన్ మీద కమల్‌నీ త్రిషనీ చూడకండి.. ఆయా కేరక్టర్లని చూడండి.. అప్పుడు అసలు ఇలాంటి మాటలే ఉండవని వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు మణిరత్నం.

థగ్‌లైఫ్ సినిమా ఫ్లాప్‌టాక్ స్ప్రెడ్ అయినప్పుడు కూడా ఈ టాపిక్ మళ్లీ రెయిజ్ అయింది.ఇప్పుడు సేమ్ టాపిక్ సితారే జమీన్ పర్ విషయంలోనూ వినిపిస్తోంది. జెనిలియాతో స్క్రీన్ షేర్ చేసుకోవటం గురించి క్లారిటీ ఇచ్చారు ఆమిర్ ఖాన్.

ఇద్దరి మధ్య రియల్ లైఫ్‌లో 23 ఏళ్ల వ్యత్యాసం ఉన్నా... కథ పరంగా కరెక్ట్‌గానే ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆమెను కాస్ట్ చేసినట్టుగా చెప్పారు. ప్రస్తుత టెక్నాలజీ కారణంగా నటీనటుల అసలు వయసు తెర మీద పెద్ద ఇబ్బందే కాదన్నారు ఆమిర్.

ఏజ్ గ్యాప్ గురించి గతంలో శ్రుతిహాసన్ కూడా స్పందించారు. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ పక్కన శ్రుతి నటించినప్పుడు ఇలాంటి మాటలే వినిపించాయి. హీరో ఏజ్ గురించి తానెప్పుడూ పట్టించుకోనన్నారు శ్రుతి. కథేంటి? కేరక్టర్ ఏంటన్నదే కీలకమని చెప్పారు.




