- Telugu News Photo Gallery Cinema photos Do You Know This Actress is 50 Years Old, Still looking Young Girl, She Is Shilpa Shetty
Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్ వయసు 50 సంవత్సరాలా..? ఇప్పటికీ తరగని అందం.. ఊహించని లుక్స్..
సాధారణంగా సినీరంగంలో స్టార్ హీరోహీరోయిన్స్ తమ లుక్స్ ఫిట్నెస్ పై ఎంతో శ్రద్ద తీసుకుంటారు. సంవత్సరాల తరబడి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటూ.. కఠినమైన వ్యాయమాలు, వర్కవుట్స్ చేస్తుంటారు. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలోని తారలు ఆరు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాళ్లుగా కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ గురించి తెలిస్తే షాకవుతారు.
Updated on: Jun 10, 2025 | 10:02 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? దశాబ్దాల తరపడి ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు బుల్లితెరపై అనేక రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఈ హీరోయిన్ మరెవరో కాదండి.. శిల్పాశెట్టి. ఈ అమ్మడి వయసు 50 సంవత్సరాలు. బాలీవుడ్ కు అత్యంత ఇష్టమైన హీరోయిన్ శిల్పా శెట్టి. సంవత్సరాలుగా యోగా, రోజువారీ వ్యాయామాల ద్వారా తన శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడంలో శిల్పా ఇతర బాలీవుడ్ హీరోయిన్ల కంటే ముందుంది.

ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అనే వ్యాఖ్యన్ని నిజం చేస్తుంది శిల్పా. జూన్ 8న ఆమె పుట్టినరోజు. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అందులో శిల్పా లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఈ బ్యూటీ వయసు 50 సంవత్సరాలు అని తెలిసి అవాక్కవుతున్నారు. ఇటీవల శిల్పా శెట్టి తన పుట్టినరోజును క్రొయేషియాలో జరుపుకున్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది శిల్పా శెట్టి. తన భర్త రాజ్ కుంద్రా తన బర్త్ డే సందర్భంగా సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చినట్లు తెలిపింది. శిల్పా శెట్టి గత కొన్ని సంవత్సరాలుగా టెలివిజన్ షోలలో చాలా చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. పలు రియాల్టీ షోలలో జడ్జీగా ఉంటుంది.

కెరీర్ మంచి పాంలో ఉండగానే వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది శిల్పా శెట్టి. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు వ్యాపారరంగంలో రాణిస్తుంది. అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టింది శిల్పా.




