AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Raja Saab: 450 కోట్ల బడ్జెట్‌తో ‘ది రాజాసాబ్’.. ప్రభాస్‌తో సహా ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ విడుదలకు ముహూర్తం దగ్గర పడింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కామెడీ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 09న గ్రాండ్ గా విడుదల కానుంది.

The Raja Saab: 450 కోట్ల బడ్జెట్‌తో 'ది రాజాసాబ్'.. ప్రభాస్‌తో సహా ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే?
The Raja Saab Movie
Basha Shek
|

Updated on: Jan 02, 2026 | 7:59 PM

Share

సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ది రాజా సాబ్. కామెడీ, హారర్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఫాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ హీరో పక్కన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ డార్లింగ్ తో రొమాన్స్ చేయనున్నారు. అలాగే బాలీవుడ్ నటులు సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, జరీనా వాహాబ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సప్తగిరి లాంటి స్టార్ కమెడియన్స్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు థమన్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే రిలీజైన పాటలు, గ్లింప్స్ , ట్రైలర్స్ రాజాసాబ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే ది రాజా సాబ్ సినిమాను సుమారు రూ.450 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్ పై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా ది రాజాసాబ్ సినిమాకు ప్రభాస్‌ తన రెగ్యులర్‌ రెమ్యునరేషన్‌ కంటే తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి డార్లింగ్ కేవలం‌ రూ.100 కోట్లు తీసుకున్నాడని టాక్. ప్రభాస్ తర్వాత డైరెక్టర్ మారుతి దాదాపు రూ. 18 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి తర్వాత బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్.

ఇవి కూడా చదవండి

ఇక హీరోయిన్ల విషయానికొస్తే కోలీవుడ్ భామ మాళవికా మోహనన్ రూ.2 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు, రిద్ధి కుమార్ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. వీరితో పాటు బ్రహ్మనందం రూ.80 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు సప్తగిరి, అనుపమ్ ఖేరలకు కూడా భారీగానే పారితోషికం అందినట్లు సమాచారం.

ది రాజాసాబ్ కొత్త పోస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ది రాజాసాబ్' కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
'ది రాజాసాబ్' కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో అప్డేట్.. ఈ ఏడాది ఎన్ని రైళ్లంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో అప్డేట్.. ఈ ఏడాది ఎన్ని రైళ్లంటే..
కోహ్లీ అంటే ఆమాత్రం ఉండాలి మరి..లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్
కోహ్లీ అంటే ఆమాత్రం ఉండాలి మరి..లేడీ క్రికెటర్ మనసు దోచేసిన కింగ్
వన్నె తరగని సోయగం.. 44 ఏళ్ల వయసులో తగ్గని అందం..
వన్నె తరగని సోయగం.. 44 ఏళ్ల వయసులో తగ్గని అందం..
AI దుర్వినియోగంపై 72 గంటల్లో చర్యల నివేదిక ఇవ్వాలని ఆదేశం
AI దుర్వినియోగంపై 72 గంటల్లో చర్యల నివేదిక ఇవ్వాలని ఆదేశం
బీచ్‌లోకి కొట్టుకొచ్చిన వింత జీవులు.. ముట్టుకుంటే మటాషే!
బీచ్‌లోకి కొట్టుకొచ్చిన వింత జీవులు.. ముట్టుకుంటే మటాషే!
ఏడు అడుగుల ముళ్ల పడక.. దానిపైకి ఎక్కి దైవ వాక్కు..
ఏడు అడుగుల ముళ్ల పడక.. దానిపైకి ఎక్కి దైవ వాక్కు..
ఈ ఆలయం అంటే మృత్యువుకే భయం.. ఎక్కడుందో తెలుసా?
ఈ ఆలయం అంటే మృత్యువుకే భయం.. ఎక్కడుందో తెలుసా?
రైతు భరోసా డబ్బులపై రేవంత్ సర్కార్ క్లారిటీ.. అకౌంట్లలోకి ఇప్పుడే
రైతు భరోసా డబ్బులపై రేవంత్ సర్కార్ క్లారిటీ.. అకౌంట్లలోకి ఇప్పుడే
బోల్డ్ సీన్స్ చేయడానికి రీజన్ అదే.. టాలీవుడ్ హీరోయిన్..
బోల్డ్ సీన్స్ చేయడానికి రీజన్ అదే.. టాలీవుడ్ హీరోయిన్..