Renu Desai: ఒడిలో చంటిబిడ్డతో నటి రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటి రేణూ దేశాయ్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఆందులో ఆమె ఓ పసిపిల్లను ఒడిలో పెట్టుకొని ఆమె కనిపించారు. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటో వైరల్ గా మారింది.

టాలీవుడ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మధ్యన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె మళ్లీ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఇటీవల రిలీజైన బ్యాడ్ గర్ల్స్ మూవీలో ఓ కీలక పాత్రలో మెరిసిందీ అందాల తార. అలాగే ‘పదహారు రోజుల పండుగ’ అనే ఒక కొత్త సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించిందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రేణూ దేశాయ్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది రేణూ దేశాయ్. తన ఒడిలో ఒక చిన్నారి ఉండగా ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన రేణూ.. ‘ పసిపిల్లలు తమ రెక్కలను దాచుకున్న దేవదూతల లాంటివారు. ఈ చిన్నారి తన ముద్దులొలికే రూపంతో నా మనసును దోచుకున్నాడు’ అంటూ ఎమోషనల్ క్యాప్షన్ జత చేసింది.
కాగా రేణూ దేశాయ్ తన పోస్ట్ కి కామెంట్ సెక్షన్ ఆమె ఆఫ్ చేయడం గమనార్హం. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రేణు దేశాయ్ ఒడిలో ఉన్న ఆ చిన్నారి ఎవరు? ఎందుకు ఆమె కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసింది? అంటూ ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి.
రేణూ దేశాయ్ షేర్ చేసిన పోస్ట్..
View this post on Instagram
కాగా ప్రస్తుతం ఆమె ‘పదహారు రోజుల పండుగ’ అనే చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఇందులో సాయి కిరణ్ అడివి హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘పదహారు రోజుల పండుగ’ సినిమా సెట్ లో నటి రేణూ దేశాయ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




