బుల్లితెరపైనా సత్తా చాటిన అందమైన ప్రేమ కథ .. భారీ టీఆర్పీ దక్కించుకున్న ఉప్పెన సినిమా..
ఇటీవల కాలంలో సూపర్ హిట్ సినిమాల జాబితాలో ముందు వరసలో చోటు దక్కించుకున్న సినిమా ఉప్పెన. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

uppena movie: ఇటీవల కాలంలో సూపర్ హిట్ సినిమాల జాబితాలో ముందు వరసలో చోటు దక్కించుకున్న సినిమా ఉప్పెన. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యారు. బెంగుళూరు బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ప్రతినాయకుడిగా రాయనం పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది.
ఉప్పెన సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కథను , సినిమాలోని ఫీల్ ను వేరే లెవల్ కు తీసుకెళ్లింది. ముఖ్యంగా ఈ సినిమాలో నీకన్ను నీలి సముద్రం అనే పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇటీవల ప్రముఖ ఛానల్ లో ఉప్పెన సినిమా ప్రసారమైంది. బుల్లితెరపై మొదటిసారిగా ప్రసారమైన ఈ సినిమాకి, 18.5 రేటింగ్ రావడం విశేషం. ఈ మధ్య కాలంలో ఇంతటి రేటింగ్ ను సాధించిన సినిమా ఇదేనని అంటున్నారు. అందమైన ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరధం పడతారు.. అందులోను కథలో దమ్ముంటే ఆ సినిమాపై అంతులేని అభిమానాన్ని చూపుతారు. అందుకు ఉదాహరణగా నిలించింది ఉప్పెన సినిమా.
మరిన్ని ఇక్కడ చదవండి :