Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponniyin Selvan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాకు బ్రేక్ వేసిన కరోనా.. వాయిదా పడిన షూటింగ్..

మణిరత్నం సినిమా అంటే ఓ మ్యాజిక్.. ఆయన సినిమాల్లో ఎదో  తెలియని మాయ ఉంటుంది. సినిమా ఎలా ఉన్నపటికీ ప్రేక్షకులను మణిరత్నం సినిమా ఆకర్షిస్తుంది.

Ponniyin Selvan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాకు బ్రేక్ వేసిన కరోనా.. వాయిదా పడిన షూటింగ్..
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 29, 2021 | 10:50 AM

Ponniyin Selvan: మణిరత్నం సినిమా అంటే ఓ మ్యాజిక్.. ఆయన సినిమాల్లో ఎదో  తెలియని మాయ ఉంటుంది. సినిమా ఎలా ఉన్నపటికీ ప్రేక్షకులను మణిరత్నం సినిమా ఆకర్షిస్తుంది. అందుకే ఆయన సినిమాలు జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్.

‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. ఇటీవలే చిత్రబృందం పొన్నియన్ సెల్వన్ షూటింగ్ షెడ్యూల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్లాన్ చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ అక్కడ కాన్సల్ అయిపోయింది. దాంతో  చెన్నైలోనే షూటింగ్ కానిద్దాం అనుకుంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా కరోనా విలయతాండవం చేస్తుంది. దాంతో చేసేదేమి లేక షూటింగ్ కు ప్యాకప్ చెప్పారట. మణిరత్నం టీమ్ పరిస్థితులు చక్కబడితే జూన్ లో షూటింగ్ ప్రారంభిద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు . తొమ్మిది మంది దర్శకులతో తొమ్మిది మంది హీరోలతో నవరస అనే వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌ను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. నవరసాలను జోడిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్‌‌‌‌‌లో ఒక్కొక్క రసాన్ని చూపించనున్నారు. దర్శకుడు జయేంద్రతో కలసి మణిరత్నం ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

గ్లోబల్ స్టార్ ఐకాన్ పెద్దగా ఉపయోగపడలేదు.. ప్రియాంక చోప్రాపై చెల్లి మీరా చోప్రా సంచలన కామెంట్స్

Trivikram: ఈసారి గురూజీ గురి తప్పిందా?…మాటల మాంత్రికుడికి ఏమైందసలు? నెక్ట్స్ ఏంటి..?

15 Years For Pokiri Movie: ట్రెండ్ సెట్టర్.. పోకిరి సంచలనానికి 15 ఏళ్లు.. ఇప్పుడు.. ఎప్పుడూ మైండ్ బ్లాకే…