గ్లోబల్ స్టార్ ఐకాన్ పెద్దగా ఉపయోగపడలేదు.. ప్రియాంక చోప్రాపై చెల్లి మీరా చోప్రా సంచలన కామెంట్స్
Meera Chopra : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది బ్యూటీ ప్రియాంక చోప్రా. ఎంతో కష్టపడి తన
Meera Chopra : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది బ్యూటీ ప్రియాంక చోప్రా. ఎంతో కష్టపడి తన ఈమెజ్‌ను రెట్టింపు చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింది. అయితే.. ప్రియాంక గ్లోబల్ స్టార్ ఐకాన్ అన్న ఇమేజ్ తనకు పెద్దగా ఉపయోగపడలేని ఆమె చెల్లి నటి మీరా చోప్రా సంచలన కామెంట్స్ చేసింది. ప్రియాంక చోప్రా వల్ల తనకు ఏమాత్రం సినిమాలు రాలేదని, కేవలం తన కష్టంతోనే సినిమా అవకాశాలు వచ్చాయంటూ తెలిపింది. ‘ప్రియాంక చోప్రా బంధువు కావడం వల్ల దర్శకులు తనను సంప్రదించలేదని.. తానే ఆడిషన్స్‌కి హాజరయ్యాని తెలిపింది.
ఆడిషన్స్‌లో నిర్మాతలు, దర్శకులకు నచ్చితేనే సినిమాల్లో తీసుకున్నారని తెలిపింది. దీని కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చిందంటూ వెల్లడించింది. తాను సినిమాల్లోకి వచ్చే నాటికే ప్రియాంకకి స్టార్ ఇమేజ్ ఉందని.. కానీ అది తన కెరియర్‌కు ఉపయోగపడలేదని స్పష్టంచేసింది. కానీ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో సాధారణంగా యువతులకు ఎదురయ్యే సమస్యలేవీ తాను ఎదుర్కోలేదని.. అదోక్కటే తనకు లభించిన అడ్వాంటేజ్ అంటూ తెలిపింది.
తనతోపాటు పరిణితీ చోప్రా, మన్నారా చోప్రా కూడా సినీ ఇండస్ట్రీ లోకి వచ్చారని.. అదృష్టవశాత్తూ తనను ఎవరితో పోల్చలేదని పేర్కొంది. ఇదిలాఉంటే.. 2005లో ఎస్.జె. సూర్య నటించిన అబ్నే ఆరుయిరే అనే తమిళ చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన మీరా చోప్రా.. దక్షిణాది సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్ సరసన బంగారం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయినా పెద్దగా అవకాశాలు లభించలేదు. బంగారం తర్వాత.. మీరా చోప్రా వాన, ఖిలాడి, జగన్మోహిని వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మీరా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో ఓ సినిమాలో నటిస్తోంది.
కరోనాతో నా కుటుంబం పోరాడింది.. చాలా భయమేసింది.. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి… అవికా గోర్ ట్వీట్..
F3 Movie: సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. ఎఫ్ 3 సినిమా విడుదలయ్యేది అప్పుడేనా..