Arjun Kapoor: ప్రియురాలిని ఆకాశానికి ఎత్తేసిన బాలీవుడ్ హీరో.. ఆమెను చూసి చాలా నేర్చుకున్నాడట..
బాలీవుడ్ హాట్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచారు. తమ రిలేషన్ గురించి ఇంత వరకు ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడని అర్జున్ కపూర్..
Arjun Kapoor: బాలీవుడ్ హాట్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచారు. తమ రిలేషన్ గురించి ఇంత వరకు ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడని అర్జున్ కపూర్.. రీసెంట్ తన పార్టనర్‌ను ఆకాశానికి ఎత్తేశారు.`మేం ప్రేమలో ఉన్నాం` అని ఓపెన్‌గా చెప్పకపోయినా… మలైకా అంటే నాకు ఎంతో ఇష్టం అన్నారు అర్జున్ కపూర్. గ్లామర్ ఇమేజ్ ఉన్న మలైకా పర్సనల్ లైఫ్‌లో ఎంత డీసెంటో వివరించారు అర్జున్ కపూర్. 20 ఏళ్ల వయసులోనే కెరీర్ ప్రారంభించిన మలైక ఎంతో హుందాగా తన ప్రొఫెషనల్ లైఫ్‌ను కొనసాగించారని చెప్పారు. వర్క్ విషయంలోనే కాదు పర్సనల్‌గానూ మలైకాను చూసి ఎంతో నేర్చుకున్నాని చెప్పారు అర్జున్ కపూర్.
అయితే ఇన్ని విషయాలు చెప్పిన అర్జున్… మలైకాతో ప్రేమలో ఉన్నానని మాత్రం కమిట్ అవ్వలేదు. కానీ ప్రజెంట్ డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఓపెన్‌గానే చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్‌తో పాటు ఫిలిం ఈవెంట్స్‌లోనూ కలిసే కనిపిస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ని పెళ్లి చేసుకున్న మలైకా.. అర్జున్‌తో ప్రేమలో పడటంతోనే విడాకులు ఇచ్చినట్లు అప్పట్లో రూమార్లు బాగా వచ్చాయి. మరో వైపు మలైకా కుమారుడు అర్హాన్‌తోనూ అర్జున్ కపూర్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రేమను చూపుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు ఈ జంట.
మరిన్ని ఇక్కడ చదవండి :